అక్కినేని నాగచైతన్యతో వైవాహిక బంధం తెగతెంపులయ్యాక, తెలుగు సినిమాల్ని అంగీకరించే విషయమై ఆచి తూచి అడుగులేస్తోంది సమంత. సమంత రూత్ ప్రభు కాస్తా సమంత అక్కినేనిగా కొన్నాళ్ళు మారినా, తిరిగి ఆమె పేరు సమంత రూత్ ప్రభు అయిపోయిన విషయం విదితమే.
సమంత – నాగచైతన్య.. ఇద్దరూ కలిసి ఓ అవగాహనకు వచ్చి, వైవాహిక జీవితాన్ని కొనసాగించలేమని భావించి విడాకులు తీసుకున్నారు. అయితే, విడాకుల ప్రాసెస్ ఇలాగే నడుస్తుందనుకోండి.. అది వేరే విషయం. చైతూ – సమంత మధ్య వచ్చిన విభేదాలేంటి.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, అదంతా వారి వ్యక్తిగత విషయంగా చాలామంది కొట్టిపారేస్తున్నారు.
సమంత మాత్రం వీలు చిక్కినప్పుడల్లా ‘అమ్మ చెప్పింది’ అంటూ సోషల్ మీడియాలో ‘టీజ్’ చేస్తున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఆ కామెంట్లు, కొటేషన్లనీ నాగచైతన్య మీద సెటైర్లేనని అక్కినేని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సమంత మీద గుస్సా అవుతున్నారు కూడా.
ఇదిలా వుంటే, సమంత త్వరలో బ్యాక్ టు బ్యాక్ మెగా కాంపౌండ్‌లో వరుస సినిమాలు చేయబోతోందట. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేసిన సమంత, పవన్ కళ్యాణ్ సరసన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోందని సమాచారం. మరోపక్క, రామ్ చరణ్ – శంకర్ దర్శకత్వంలో ఓ కీలక పాత్ర కోసం సమంత పేరు పరిశీలనలోకి వచ్చిందట.
ఇంకేముంది, మెగా కాంపౌండ్ సమంతని అక్కున చేర్చుకుందనే ప్రచారం జోరందుకుంది. అన్నట్టు, సమంత – ఉపాసన (చరణ్ సతీమణి) మధ్య మంచి స్నేహం వున్న సంగతి తెలిసిందే.