నిన్ననే ఊహించని విధంగా స్టార్ నటీనటులు అక్కినేని నాగ చైతన్య మరియు సమంతా (సామ్) లు తమ వివాహ బంధం నుంచి విడిపోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించడంతో వారి ఫాలోవర్స్ మరియు ఇండస్ట్రీలో కూడా ఒక ప్రత్యేక వాతావరణం నెలకుంది. వారి వ్యక్తిగత జీవితం వారి ఇష్టం అయ్యిందేదో అయ్యిపోయింది కానీ ఓ స్టార్ హీరో పెట్టిన ట్వీట్ తో సామ్ విడాకులకు ఎక్కడో లింక్ ఉంది అంటూ ఓ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
దీనిపై కాస్త వెనక్కి వెళితే.. గతంలో సమంతా మరియు యూత్ క్రేజ్ ఉన్న హీరో సిద్ధార్థ్ లు రిలేషన్ లో ఉన్నారని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. మరి తాజాగా సామ్ తన విడాకులు ప్రకటించాక సిద్ధార్థ్ ఓ ట్వీట్ పెట్టాడు. ఇపుడు అదే వైరల్ అవుతుంది. ఇంతకీ అందులో ఏముందంటే.
“స్కూల్ లో నా గురువుల దగ్గర నుంచి నేను నేర్చుకున్న మొట్ట మొదటి పాఠం ఏమిటంటే మోసం చేసేవాళ్ళు ఎన్నటికీ అభివృద్ధి చెందరు” అని ట్వీట్ పెట్టాడు. దీనితో సామ్ కి రిలేటెడ్ గానే ఇది పెట్టి ఉంటాడని కొంతమంది భావిస్తున్నారు. మరి సిద్ధార్థ్ ఏ ఉద్దేశ్యంతో పెట్టాడో కానీ ఇదైతే ఇప్పుడు వైరల్ అవుతుంది.