సూపర్ ట్విస్ట్ ఇచ్చిన సమంత

Samantha Akkineni Super Twist | Telugu Rajyam

టాలీవుడ్ క్రేజీ పెయిర్ అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల మేటర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తున్న సంగతి తెలిసిందే. బోడి గుండుకీ, మోకాలికీ ముడి అన్నట్లుగా, ఈ ఫ్యామిలీ నుంచి ఏ విషయమై ఎవ్వరు బయటికి వచ్చినా, వీరి ముందు ఈ ప్రస్థావన తప్పడం లేదు.

ఇంకేముంది నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతోందట. అందుకోసం 250 కోట్ల వరకూ భరణం తీసుకుంటుందట. అందుకు అన్ని వైపులా సెటిల్మెంట్స్ కూడా జరిగిపోయాయట.. అంటూ జోరున ప్రచారం జరుగుతోంది.

అయితే, ఈ విషయమై ఇటు నాగ చైతన్య కానీ, అటు సమంత కానీ ఇద్దరూ స్పందించలేదు. అలాగే నాగార్జున నుంచి కూడా ఎలాంటి రెస్సాన్స్ రాలేదు. ఓ వైపు నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ, ఆ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు.

సోషల్ మీడియాలో చై సినిమాలను సపోర్ట్ చేస్తూ, తన వంతుగా ప్రమోషన్ స్టంట్స్ చేసే సమంత ‘లవ్ స్టోరీ’ విషయంలో ఒక్క చిన్న ట్వీట్ కూడా పెట్టలేదు.. సరికదా.. తన పాత స్నేహితులతో కొత్త కొత్తగా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్త్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో పోస్ట్ చేస్తూ కొత్త సందడి మొదలుపెట్టింది.

ఆ పాత స్నేహితుల్లో త్రిష తదితర ముద్దుగుమ్మలు కూడా ఉండడం విశేషం. ఈ సిట్యువేషన్ చూస్తే, సమంత హైద్రాబాద్‌కి గుడ్ బై చెప్పేసి ముంబయ్‌లో సెటిలైపోతుందని గుసగుసలాడుకుంటున్నారంతా. అయితే, తానెక్కడికీ వెళ్లననీ, హైద్రాబాద్‌లోనే ఉంటానని కుండ బద్దలుకొట్టేసింది సమంత. ఈ విషయంలో అలా క్లారిటీ ఇచ్చిన సమంత, డైవర్స్ విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటోందో.. అభిమానులకు అర్ధం కావడం లేదు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles