కొన్ని భారీ సినిమాలు వస్తున్నాయి అంటే మరికొన్ని సినిమాలు తప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి కొద్ది భారీ చిత్రాల్లో రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. అయితే ఈ సినిమాని ఎలా అయినా ఇంకోసారి వాయిదా లేకుండా వచ్చే ఏడాది జనవరి 7న తీసుకొచ్చేయడం పక్కా అని తెలుస్తుంది.
మరి దానిని నిజం చేస్తూ ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ని చిత్ర యూనిట్ ఇపుడు రాబోతున్న దీపావళి పండుగకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా సినీ వర్గాల్లో సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ది బెస్ట్ టీజర్ కట్ ను దీపావళి కానుకగా లేదా అంతకు ముందే రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇప్పుడు వరకు కూడా భీం, అల్లూరిల పై సెపరేట్ టీజర్స్ చూసిన మనం ఈసారి ఇద్దరిదీ కలిపి ఒకటి చూడబోతున్నాం అనమాట. సో దీనిపై మరింత సమాచారం మున్ముందు రాబోతుంది సిద్ధంగా ఉండండి.