రైజ్ ఆఫ్ ‘శ్యామ్’ అసలు సిసలు బెంగాళీ కుర్రోడిగా నేచురల్ స్టార్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాపై బజ్ బాగా క్రియేట్ అవుతోంది. తొలి పోస్టర్ నుంచీ ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి. అంచెలంచెలుగా ఆ అంచనాల్ని రెట్టింపు చేసుకుంటూ వస్తున్నారు మేకర్లు. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

దసరా సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో బెంగాలీ కుర్రోడిగా నాని గెటప్ ఆకట్టుకుంది. లేటెస్టుగా మరో స్టిల్ రిలీజ్ చేశారు. కుర్చీలో వైట్ అండ్ వైట్ డ్రస్ ధరించి రాజసంగా కూర్చున్న స్టిల్ ఇది. చేతిలో సిగరెట్, పదునైన హావ భావాలు.. క్లీన్ షేవ్, మీసకట్టు.. ఇది కూడా బెంగాళీ గెటప్పే. ఈ గెటప్ మరింత ఆకట్టుకోవడమే కాదు, సినిమాపై అంచనాల్ని మరింత పెంచేలా ఉంది.

నవంబర్ 6న ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేస్తూ, ఈ న్యూ స్టిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిశంబర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.