దేవరకొండకి ఆర్జీవీ ఇస్తున్న ఎలివేషన్ మాములుగా లేదు

విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో స్టార్ అయిపోయాడు. ప్రేక్షకుల కంటే ముందు తానే తనను స్టార్ హీరోగా ప్రాజెక్ట్ చేసుకున్నాడు. అతనిలోని ఈ రెబల్ యాటిట్యూడ్ చూసే చాలామంది యూత్ ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ అనే స్టాంప్ వేయించుకున్న విజయ్ ఇప్పుడు మార్కెట్ పరంగా స్టార్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న లైగర్ సినిమాతో బాలీవుడ్లోకి కూడ అడుగుపెడుతున్నాడు. భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉంది.

ఈ సినిమా గనుక హియ్ అయితే విజయ్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోవడం ఖాయం. అందుకే లైగర్ రిజల్ట్ మీద ఇండస్ట్రీ జనాలకు కూడ ఒక కన్ను ఉంది. ఇదిలా ఉంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం విజయ్ కు స్టార్ హీరోను మించిన ఎలివేషన్ ఇచ్చేస్తున్నాడు. లైగర్ సినిమాలో విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఏ స్టార్ హీరో కంటే కూడ తక్కువగా లేదని కాంప్లిమెంట్ ఇస్తున్నాడు. అంతటితో ఆగలేదు.. గత రెండు దశాబ్దాల్లో వచ్చిన అందరు స్టార్ హీరలకి విజయ్ ఏమాత్రం తక్కువ కాదని కితాబిస్తున్నాడు. మరి ఆర్జీవీ ఇస్తున్న ఎలివేషన్ చూస్తుంటే లైగర్ చిత్రం మీద మరింత ఆసక్తి క్రియేట్ అవుతోంది. మరి నిజంగా ఆర్జీవీ అంటున్నట్టు లైగర్ సినిమాలో అంత విషయం ఉందో లేదో చూడాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే మరి.