Happy Raj: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘హ్యాపీ రాజ్’ తెలుగు ప్రోమో విడుదల

Happy Raj: ఆసక్తికరమైన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. ప్రమోషన్స్ పరంగా వినూత్నంగా వెళ్తున్న చిత్ర యూనిట్ తాజాగా అధికారిక ప్రోమో విడుదల చేసింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన తెలుగు ప్రోమో.. సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది. డిఫరెంట్ స్టైల్ మేకింగ్ తో విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియా వేదికలో ఈ వీడియో వైరల్ అయింది.

జయవర్ధన్ నిర్మిస్తున్న ఈ చిత్రం, బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మారియా ఎలాంచెజియన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కనిపించే ప్రతి ఫ్రేమ్ కూడా వైవిధ్యంతో కూడి ఉండి ఆకర్షిస్తోంది.

ఈ సినిమాలో జీవీ ప్రకాశ్ కుమార్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. రిఫ్రెషింగ్ విజువల్స్, లైట్ హ్యూమర్, హాయిగా సాగే టోన్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అనుభూతిని అందించబోతోందనే నమ్మకాన్ని ప్రోమో బలంగా కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ రోజుల్లో అవసరమైన హ్యాపీనెస్‌ను అందించే సినిమాగా ఇది నిలవబోతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Happy Raj - Vibe Check (Promo) | GV Prakash | Abbas | Sri Gouri Priya | Maria Raja Elanchezian

ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్ కుమార్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ గౌరి ప్రియా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, చాలా కాలం తర్వాత అబ్బాస్ మళ్ళీ సినిమాల్లోకి తిరిగి రావడం విశేషంగా మారింది. ఇకపోతే ఈ చిత్రంలో జార్జ్ మరియం, ప్రార్థనా, అధిర్చి అరుణ్, మదురై ముత్తు, సోఫా బాయ్ రసూల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను మారియా ఎలాంచెజియన్ నిర్వర్తించగా.. జైకాంత్ సురేష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మధన్ క్రిస్టఫర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఆర్‌కే సెల్వా ఎడిటింగ్, కుమార్ గంగప్ప ఆర్ట్ డైరెక్షన్, ప్రవీణ్ రాజా కాస్ట్యూమ్స్ బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా, ప్రోమోతోనే మంచి అంచనాలను క్రియేట్ చేసిన ‘హ్యాపీ రాజ్’, ఓ కంప్లీట్ ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం చెబుతోంది.

*నటీనటులు:* జీవీ ప్రకాశ్ కుమార్, శ్రీ గౌరి ప్రియా, జార్జ్ మరియం, ప్రార్థనా, అధిర్చి అరుణ్, మదురై ముత్తు, సోఫా బాయ్ రసూల్

దర్శకత్వం: మారియా ఎలాంచెజియన్
బ్యానర్‌: బియాండ్ పిక్చర్స్
నిర్మాత: జైవర్ద
సహ నిర్మాత: జైకాంత్ సురేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విశ్రత్ KL
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్: ఆర్‌కే సెల్వా
ఆర్ట్ డైరెక్టర్: కుమార్ గంగప్ప
కాస్ట్యూమ్స్: ప్రవీణ్ రాజా
PRO : సాయి సతీష్

Public Reaction On Ys Jagan Warning To Chandrababu || Ap Public Talk || Pawan Kalyan || TeluguRajyam