టాలీవుడ్ సినిమా నుంచి అనౌన్స్ అయినటువంటి మరో బిగ్గెస్ట్ క్రేజీ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ అనే చెప్పాలి. మరి ఎప్పుడు నుంచో ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు ఈ భారీ సినిమాని మేకర్స్ గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.
అలాగే మహేష్ బాబు కూడా ఈ సినిమా పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉండగా ఈ సినిమాపై ఓ ఊహించని వార్త ఒకటి ఇప్పుడు ఇన్సైడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరి అదేమిటంటే జక్కన్న మహేష్ బాబు తో ఈ ప్రాజెక్టుని కేవలం ఒక్క సినిమాగా మాత్రమే తీయట్లేదట.
దీనిని ఫ్రాంచైజ్ గా ప్లాన్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా సినీ వర్గాలు ఇపుడు గుసగుసలాడుతున్నాయి. అంటే డెఫినెట్ గా ఈ కాంబినషన్ లో రెండు సినిమాలు ప్రస్తుతానికి ఆశించవచ్చు అలాగే భవిష్యత్తులో కూడా మరొకటి వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదని లేటెస్ట్ గా పలు ట్రస్టడ్ సినీ వర్గాల నుంచి సమాచారం.
మొత్తానికి అయితే మొదటిసారి పడుతున్న వీరి కాంబో భారీ రికార్డులు నమోదు చేయడం ఖాయం అని చెప్పొచ్చు. అలాగే మరిన్ని వివరాలు ఈ సినిమాపై రానున్నాయి.