సైకో పవన్ కళ్యాణ్ అంటూ ఇండియన్ వైడ్ ట్రెండ్..ఎందుకో?

ఇప్పుడు ఓ పక్క టాలీవుడ్ సహా ఏపీ రాజకీయాల్లో కార్నర్ అయ్యింది ఎవరు అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ప్రధానంగా ఏపీలో నెలకొంటున్న సమస్యలకి తాను మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అలానే తన సినిమా ఇండస్ట్రీకి కూడా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఏ అగ్ర హీరో కూడా ఆ సమస్యపై మాట్లాడ్డానికి ఆసక్తి చూపని సమయంలో తానే ముందుకు వచ్చి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

అయితే కొన్ని సార్లు తన చేష్టలు కన్ఫ్యూజన్ గా అనిపించినా అంతిమంగా మంచి కోసమే నిలబడ్డాడు అనిపిస్తుంది. మరి ఇప్పుడు మళ్ళీ పవన్ గత కొన్నాళ్ల కితం ఎదుర్కొన్న పరిస్థితులే మళ్ళీ నెలకొన్నాయని చెప్పొచ్చు. ఓపక్క సినిమాలు చేస్తూనే పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ తాజాగా ఇస్తున్న స్టేట్మెంట్స్ ఒక్కోరకమైన ఫీడ్ బ్యాక్ ని అందుకుంటున్నాయి.

ఇక సోషల్ మీడియాలో అయితే పవన్ అభిమానులకి వ్యతిరేఖులకి జరిగే వాగ్వాదం మరో స్థాయిలో ఉంటుంది. అలానే ఇప్పుడు సైకో పవన్ కళ్యాణ్ అనే ట్యాగ్ ఇండియన్ వైడ్ ట్రెండ్ అవుతూ వస్తుంది. అయితే దీనికి కారణం నిన్న జరిగినటువంటి మీటింగ్ అనే చెప్పాలి. తన గత మీటింగ్స్ తో పోలిస్తే నిన్నటిదే కాస్త క్లారిటీగా ఉంది అని జెనరల్ ఫాలోవర్స్ టాక్.

అయినా కూడా పవన్ మాటలు కులాల నడుమ చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని ఈ నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది వైరల్ అవుతుంది. మరి మళ్ళీ పవన్ పై తీవ్ర స్థాయిలో స్టార్ట్ అయిన ఈ ఎటాక్ ఎప్పుడు ఆగుతుందో చూడాలి. ప్రస్తుతం పవన్ సాగర్ చంద్ర దర్శకత్వంలో “భీమ్లా నాయక్” అనే మాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.