పవన్ కళ్యాణ్ – ఇంకో ‘మూడు’ కు గ్రీన్ సిగ్నల్

రాజకీయం రాజకీయమే.. సినిమా సినిమానే. అయితే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చుట్టూ నెలకొన్న వివాదాల కారణంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలన్నీ ఎలా పూర్తి చేస్తాడో.? అసలు సినిమా కెరీర్ ఏమవుతుందో.? అనే అనుమానాలు ఆయన అభిమానులు, సన్నిహితుల్లో ఉన్నాయి.

అంతేకాదు, బడా నిర్మాతలు పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీసేందుకు రిస్క్ చేయాలనుకోవడం లేదట. ఇక చిన్న నిర్మాతలయితే ఎందుకొచ్చిన తంటాలే అని ముందుకు రావడం లేదట.. అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో నడుస్తోంది. అయితే, అయితే, తూచ్.. అవన్నీ జస్ట్ అనుమానాలే.. అని కొట్టి పాడేసేలా ఓ హాట్ అప్టేట్ ఒకటి తెరపైకి వచ్చింది.

ఓ ముగ్గురు బడా నిర్మాతలు పవన్ కళ్యాణ్‌తో సినిమా తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారట. పవన్ ఓకే అనగానే ఆ మూడు సినిమాలూ పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నారట. ఇంతకీ ఎవరా నిర్మాతలు.? ఏంటా కథ.? అనేది తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాలి.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ‘భీమ్లానాయక్’, ‘హరిహర వీరమల్లు’, భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలు సహా, మరో మూడు ప్రాజెక్టులు ఆల్రెడీ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే.