పవన్ క్లారిటీగా ఉన్నాడు..మరి మహేష్??

 

మన టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోల నడుమ భారీ యుద్ధం ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల మధ్య యుద్ధాన్ని మ్యాచ్ చెయ్యడం ఎవరి వల్ల కాదు అని చెప్పాలి. సెపరేట్ టైమ్స్ లో వీరి సినిమాలు రిలీజ్ అయ్యినప్పుడే అన్ని రికార్డులు పరంగా హాట్ టాపిక్ నడుస్తుంది. అలాంటిది ఇద్దరి సినిమాలు ఒకే టైం లో వస్తే ఎలా ఉంటుందో మరోసారి చూసేందుకు వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ ఫిక్స్ అయ్యింది.

అయితే ఒక్కరోజు తేడాతో ఇద్దరి సినిమాలు “భీమ్లా నాయక్” అలాగే “సర్కారు వారి పాట” చిత్రాలు రిలీజ్ కానుండగా భారీ పాన్ ఇండియన్ చిత్రం ‘RRR’ చిత్రం సడెన్ గా రావడంతో మహేష్ సినిమా డౌట్ గానే ఉన్నా పవన్ సినిమా మాత్రం ఇప్పుడు వరకు కూడా ఎలాంటి డౌట్ లేకుండా జనవరి 12 కే ఫిక్స్ అయ్యి ఉంది.

దీనితో పవన్ సినిమా క్లారిటీ గానే ఉన్నాడు కానీ మహేష్ మాత్రం ఇంకా సందిగ్ధం లోనే ఉన్నాడట. రాజమౌళి కోసం ఆగాలా లేక డేర్ చేసి దిగాలా అన్నది ఇంకా చర్చలోనే ఉన్నట్టు తెలుస్తుంది. అది ఇంకొన్ని రోజులు ఆగితే క్లారిటీ వస్తుందని సమాచారం.