టాలీవుడ్ మోస్ట్ లవ్లీ కపుల్ గా పేరున్న సమంత మరియు అక్కినేని నాగ చైతన్య (సామ్ – చైతూ) ల కాంబో నిన్న ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటన ఇవ్వడం ప్రతీ ఒక్కరికీ షాక్ ఇచ్చింది. అయితే వారి వ్యక్తిగత కారణాల చేత వీరిద్దరూ విడిపోయారు. కానీ ఇంతకు ముందు నుంచీ ఈ అనుమానం అందరిలో ఉన్నా ఒక క్లారిటీ అయితే నిన్న వచ్చేసింది. మరి మొదటి నుంచి కూడా ఓ వర్గం మీడియా అత్యుత్సాహ మీడియా ఏదో రకంగా వీరి వైవాహిక జీవితంపై ఏదొక తప్పుడు వార్త స్ప్రెడ్ చేస్తూనే వస్తున్నారు.
ఇప్పుడు కూడా వీరు అధికారికంగా విడిపోతున్నాం అని చెప్పినా ఇవే కారణాలు అంటూ మళ్ళీ చెత్త స్టార్ట్ చేశారు. సామ్ లో ఇది నచ్చలేదు తాను ఇలా ఉండట్లేదు అలా ఉండట్లేదు అని రకరకాల వార్తలు మీడియాలో ప్రచురిస్తున్నారు. దీనికన్నా ఓ హద్దు ఉంటుంది అంటారు వారు మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా మాకేటి సిగ్గు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దీనితో వీక్షకులు ఈ వార్తలు విని చిర్రెత్తుతున్నారు.