అక్ర‌మ మ‌ద్యం, ఇసుక పై జ‌గ‌న్ సీక్రెట్ మిష‌న్

ఏపీ యంగ్ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పీఠం ఎక్క‌గానే ఇసుక మాఫియాపై క‌న్నెరజేసిన సంగ‌తి తెలిసిందే. ఇసుక మాఫియాని క‌ట్ట‌డి చేయ‌డ‌మే సంక‌ల్పించి పూర్తి ప్ర‌క్షాళ‌న‌తో నూత‌న విధానాన్ని అమ‌లులోకి తీసుకొచ్చారు. ఇసుక కావాలంటే డైరెక్ట్ ఆన్ లైన్ లో నే బుక్ చేసుకునే విధంగా వెసులుబాటు తీసుకొచ్చారు. ఇసుక రీచ్ ల‌పై ఎక్క‌డిక్క‌డ భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేసి బోర్డ‌ర్ దాట‌కుంటా చేయ‌డంలో నూటికి నూరుపాళ్లు స‌క్సెస్ అయ్యారు. అయితే ఇసుక మాఫియా ఇంకా పూర్తిగా క‌నుమ‌ర‌గ‌వ్వ‌లేదు. రాష్ర్టంలో అక్క‌డ‌క్కడా  అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయి. ఇక మ‌ద్య నిషేధ విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి వ్యూహాల‌తో ముందుకెళ్తున్నారో? తెలిసిందే.

లాక్ డౌన్ నేప‌థ్యంలో మ‌ద్యం షాపులు ఓపెన్ చేసి విమ‌ర్శ‌లు ఎదుర్కున్న‌ప్ప‌టికీ తాను చెప్పింది చేసి తీరుతాన‌ని మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్ఘాటిస్తూనే ఉన్నారు. తాజాగా మ‌ద్యం, ఇసుక‌పై జ‌గ‌న్ సీక్రెట్ మిష‌న్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌ద్యం-ఇసుక అక్ర‌మాల‌ను అడ్డుకోవ‌డం కోసం ఏకంగా ఓ కొత్త టీమ్ నే రంగంలోకి దింపుతున్నారు. స్పెష‌ల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ ఈబీ-లిక్క‌ర్ అండ్ శాండ్)క‌మీష‌న‌ర్ వినీత్ బ్రిజ్ లాల్ ఈ విష‌యంపై మాట్లాడ‌టం విశేషం. మ‌ద్యం-ఇసుక అక్ర‌మాల‌ను త‌మ ముందున్న స‌వాళ్లుగా వినీత్ బ్రిజ్ లాల్ పేర్కొన్నారు. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ఎస్ ఈబీని ఏర్పాటు చేసిన‌ట్లు క‌మీష‌న‌ర్ తెలిపారు.

మంగ‌ళ‌గిరి పోలీస్ ప్ర‌ధాన కార్యాల‌యం కేద్రంగా డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎస్ ఈబీ ప‌నిచేస్తుందిట‌. ఈ టీమ్ లో త్వ‌ర‌లో మ‌రో 11 మంది ఐపీఎస్ లు రానున్నారుట‌. రాష్ర్టంలో మొత్తం 18 పోలీస్ యూనిట్ ల‌కు ఎస్ ఈబీ టీమ్ లీడ‌ర్ల‌ను ఏర్పాటు చేస్తారుట‌. నేరుగా పోలీసు శాఖ రంగంలోకి దిగ‌డ‌మే కాకుండా ఎస్ ఈబీ ఎక్సైజ్ శాఖ నుంచి కూడా అధికార సిబ్బందిని నియ‌మిస్తామన్నారు. ఆయా జిల్లాల పోలీసులు కూడా ఈ టీమ్ ను ఉప‌యోగించుకుంటాయ‌ని క‌మీష‌న‌ర్ తెలిపారు.