Health Tips: చికెన్ లివర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Health Tips: సాధారణంగా ఈ మధ్యకాలంలో నాన్ వెజ్ తినే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. చికెన్, మటన్ ఉపయోగించి వివిధ రకాలుగా వంటకాలను తయారుచేసి చాలా ఇష్టంగా తింటుంటారు.ఆదివారం వచ్చిందంటే చాలు ఆ రోజు మొత్తం నాన్ వెజ్ వంటకాలతో కడుపు నిండిపోతుంది. చాలామంది మటన్ కన్న చికెన్ ఇష్టంగా తింటుంటారు. కొద్ది మంది చికెన్ రివర్స్ తినటానికి ఎక్కువ ఆసక్తి చూపరు. కానీ చికెన్ లివర్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

చికెన్ లివర్ లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్, క్యాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మటన్ లివర్ కన్నా చికెన్ లివర్ లో అనేక రకాల పోషకాలు ఉండి మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుందని నిపుణులు వెల్లడించారు.

చికెన్ లివర్ ఫ్రై లాగా కాకుండా కొంత మోతాదులో ఉడికించి తినటం వల్ల బరువు పెరుగుతామనే భయం ఉండదు. అంతేకాకుండా చికెన్ లివర్ లో విటమిన్ బి12 పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలోని రక్తాన్ని సిద్ధపరిచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

చికెన్ లివర్ లో సెలీనియం ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల క్యాన్సర్, కీళ్ల నొప్పులు, నులిపురుగుల సమస్య, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

చికెన్ లివర్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపు కి సంబంధించిన వ్యాధులు నియంత్రించి కంటి చూపు మెరుగు పడేలా చేస్తుంది. అంతేకాకుండాషుగర్ వ్యాధితో బాధపడేవారు చికెన్ లివర్ తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.