రోజుకు ఎన్ని గుడ్లు తినాలి.. గుడ్డు వల్ల లాభ నష్టాలు ఏంటో తెలుసా?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అందులోనూ పౌష్టికహారాన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పౌష్టికాహారం అంటే మొదటగా గుర్తొచ్చేవి ‘గుడ్డు’. గుడ్డు మంచి పోషక విలువలు కలిగి ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు గుడ్డు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.గుడ్డు తినటం ఆరోగ్యానికి మంచిది కదా అని లెక్కలేకుండా వాటిని తినటం వల్ల చాలా నష్టాలే ఉన్నాయి. ఎంత పౌష్టికాహారమైన మితంగా తినటం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇలా కాకుండా మితిమీరి తినటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఇప్పుడు మనం రోజుకు ఎన్ని గుడ్లు తీసుకోవాలి వాటివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు,నష్టాల గురించి తెలుసుకుందాం. గుడ్డు మంచి పౌష్టికాహారం విలువలు గల ఆహారం. ఇందులో ఎన్నో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. చిన్నపిల్లలు మొదలుకొని, ముసలివారి వరకు డాక్టర్లు గుడ్డు తినమని చెబుతారు. పోష కాహార సమస్యతో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సలహాలిస్తుంటారు.

గుడ్డుమీద జరుగుతున్న పరిశోధనలు ఏటా కొత్త ఫలితాలను ఇస్తూనే వున్నాయి. కానీ కచ్చితంగా రోజుకి ఎన్ని గుడ్లు తినాలన్నది సరైన సమాధానం చెప్పటం కష్టమే. ఎందుకంటే ఒక మనిషి ఆరోగ్యాన్ని బట్టి ఎంత ఆహారం తీసుకోవాలి తెలుపవచ్చు.కనుక రోజుకు ఎన్ని గుడ్లు తీసుకోవాలన్నది వారి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కానీ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం రోజుకు ఒకటి లేదా రెండు కోడి గుడ్లు తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కోడిగుడ్లను అతిగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. గుడ్డులోని పచ్చసొనలో అధికంగా కొలెస్ట్రాల్ ఉంటుంది. పచ్చసొనలోని చెడు కొలెస్ట్రాల్ వల్ల మన శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ మొత్తంలో గుడ్లు తినడం వల్ల శరీరంలో అధిక వేడి కలుగుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తే కాకుండా పెరుగు కదలికలు మందగిస్తాయి. ఇకపోతే వేసవి కాలంలో చిన్న పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్త అవసరం. వేసవి కాలంలో చిన్నపిల్లలకు గుడ్లు చాలా తక్కువగా తినిపించాలి అతిగా తినిపించడం వల్ల అతిసారం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.