Crime News: భారతదేశం సాంప్రదాయాలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు సాంప్రదాయాలు ఉన్నాయి. ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో వివాహ బంధానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుత కాలంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి వివాహ బంధానికి ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోతుంది. భార్యాభర్తలు మధ్య మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవడం, వివాహేతర సంబంధాలు ఎక్కువ అవటం వల్ల ఈ వివాహానికి బంధానికి విలువ లేకుండా పోతోంది.
ఒడిస్సా లో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక వ్యక్తి 20 సంవత్సరాలలో ఏడు రాష్ట్రాలకు చెందిన 14 మంది మహిళలని వివాహం చేసుకొని మోసం చేశాడు. వివరాలలోకి వెళితే..ఒడిశాలోని కేంద్రపర జిల్లాకు చెందిన బిధు ప్రకాష్ స్వైన్(54) అనే వ్యక్తి వృత్తిరీత్యా డాక్టర్ అని చెప్పుకుంటూ అందరిని మోసం చేసి వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను వివాహం చేసుకొని మోసం చేస్తున్నాడు. భర్త చనిపోయిన మహిళలు, విడాకులు తీసుకున్న వారు, మధ్య వయస్కులను మాత్రమే టార్గెట్ చేసి వివిధ రకాల మ్యాట్రిమోనీ సైట్స్ డబ్బు కోసం మహిళలకు ఎరవేసి మోసం చేసి రహస్యంగా వివాహాలు చేసుకుంటాడు.
రోజులు వారితో ఉండి తర్వాత పని నిమిత్తం ఇతర ప్రదేశానికి వెళుతున్నానని చెప్పి మోసం చేసేవాడు. ఈ తరుణంలో జులై 2021లో ఢిల్లీకి చెందిన ఓ టీచర్ న్యూఢిల్లీలోని ఆర్యసమాజ్ ఆలయంలో స్వైన్ తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు భువనేశ్వర్‌లోని ఖండగిరి ప్రాంతంలోని ఓ ఇంట్లో నిందితుని అరెస్టు చేసి విచారణ చేయగా.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇదివరకే వివిధ మాట్రిమోనియల్ సైట్ ద్వారా 13 మందిని వివాహం చేసుకొని మోసం చేసినట్టు పేర్కొన్నాడు. ఇదివరకే నిందితుడి మీద పలు కేసులు ఉండటం గమనార్హం. పోలీసులు నిందితుని దగ్గర 11 ఏటీఎం కార్డులు, 4 ఆధార్ కార్డులు, స్కూల్ సర్టిఫికెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.