ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు మాజీలు: వైకాపాలోకి అడుగుపెడుతూనే సూపర్ గిఫ్ట్ తెస్తున్న గంటా..?

విశాఖ: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అలాగే శాశ్వత స్నేహితులు ఉండరనేది గంటా శ్రీనివాస రావును చేస్తుంటే నిజమనిపిసిస్తుంది. ఏ పార్టీలోకి వెళ్లినా ప్రజలేమి పట్టించుకుంటారా అనే ధీమా రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ఉంటారు. అలాగే 2019 ఎన్నికలప్పుడు వైసీపీని ఇష్టమొచ్చినట్టు తిట్టిన గంటా ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాడానికి రంగం దాదాపు పూర్తి చేసుకున్నారు.వైసీపీ నాయకులు గంటా రాకను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడే ఇక్కడ వైకాపా రాజకీయ పండితులు తమ చాణిక్య నీతిని ప్రదర్శిస్తున్నారు. గంటా రాకను వైసీపీ నాయకులు ఎదురిస్తున్నప్పటికి అధిష్టానం మాత్రం గంటాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలకడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గంటాను పార్టీలోకి ఆహ్వహించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే…విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.

అయితే అక్కడ మొత్తం టీడీపీ నాయకులకే బలముంది కాబట్టి పరిపాలనలో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించిన వైసీపీ నాయకులు ఆ బలాన్ని బలహీన పరచడానికే గంటాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాస రావు వైసీపీలోకి వస్తుండటంతో ఆయనతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరు పార్టీలోకి రావడంతో అక్కడ తమకు అడ్డు ఉండదని భావిస్తున్న వైసీపీ నాయకులు రెడ్ కార్పెట్ వేసి మరీ శ్రీనివాస రావును ఆహ్వానిస్తున్నారని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలో ఒకరు గణేష్ అని తెలుస్తుండగా, మరొకరు ఎవరన్నది సస్పెన్సుగా ఉంది. అలాగే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతున్నారు.

వైసీపీ నాయకులు వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ను టీడీపీ నాయకులు ఎలా ఎదురుకొంటారో వేచి చూడాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తుంటే వచ్చే ఎన్నికల వరకు టీడీపీ క్యాడర్ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. గంటా శ్రీనివాస రావు టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చినప్పటికీ వైసీపీకి మాత్రం వస్తూనే వెలకట్టలేన్నంత పెద్ద గిఫ్ట్ తో నాయకులను సంతోషపరచనున్నారు.