Health Benifits: ప్రతిరోజు మనం తీసుకొనే ఆహారంతో పాటు పండ్లు తినటం వల్ల డాక్టర్ ని సంప్రదించవలసిన అవసరం ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక రకమైన పండు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా అందరూ పండ్లు తిని వాటి తొక్కలను పడేస్తుంటారు. కానీ కొన్ని రకాల పండ్ల తొక్క లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అటువంటి వాటిలో దానిమ్మ పండు కూడా ఒకటి. దానిమ్మపండు తొక్కలో ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వాటివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా దానిమ్మపండు గింజలను తినటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఒకటి లేదా రెండు దానిమ్మపండ్లు తినటం వల్ల శరీరంలో రక్త శాతం పెరుగుతుంది. దానిమ్మ పండు తొక్కలో కూడా ఐరన్ శాతం ఎక్కువగా ఉండి రక్తహీనత సమస్య నుండి విముక్తినిస్తుంది.
దానిమ్మపండు తొక్కలను నీడలో ఆరబెట్టి వాటిని పొడిచేసి సీసాలో భద్రపరచుకోవాలి. షుగర్ వ్యాధితో బాధ పడేవారు ఈ దానిమ్మ పండు తొక్కల పొడిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ పొడి వేసి కలిపి తాగటం వల్ల షుగర్ సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. దానిమ్మ పండు తొక్కలతో చేసిన పొడికి కొంచెం ఉప్పు , పుదీనా ఆకులు వేసి మెత్తగా పేస్ట్ చేసి దంతాలకు పేస్ట్ లాగా ఉపయోగించడం వల్ల దంతాలు సమస్యలు తగ్గుతాయి.
దానిమ్మ పండు తొక్క లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఏదైనా గాయం తగిలినప్పుడు దానిమ్మ పండు తొక్కలను మెత్తగా రుబ్బి గాయం మీద రాసి కట్టు కట్టడం వల్ల గాయం తొందరగా తగ్గిపోతుంది. దానిమ్మ పండు తొక్కలను నీటిలో బాగా ఉడికించి ప్రతిరోజు ఉదయం ఆ నీటిని తాగటం వలన కీళ్ల నొప్పులు , కండరాల నొప్పులు తగ్గి ఎముకలు దృఢంగా తయారవుతాయి.