Health Tips: మూడుపూటలా అన్నం తింటున్నారా?ఆరోగ్య సమస్యలు తప్పవు జాగ్రత్త సుమీ..!

Health Tips: దేశంలో వివిధ రకాల ప్రాంతాలలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా మన భారత దేశంలో ప్రజలకు అనేకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. సౌత్ ఇండియాలో ఎక్కువగా అన్నం ఉపయోగిస్తే, నార్త్ ఇండియాలో ఎక్కువగా రోటీలు తింటుంటారు.అయితే ఏదైనా మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తినే అనారోగ్యం అని మనందరికీ తెలిసిన విషయమే. పూర్వం ప్రతిరోజు మూడు పూటలా అన్నం తినే వారు. వారు శారీరకంగా ఎక్కువగా కష్టపడటం వల్ల మూడు పూటలా అన్నం తిన్నా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కావు.

ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ తగ్గి ఆహారపు అలవాట్లు మారటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.అన్నం ఎక్కువగా తినే వారికి మధుమేహ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. డయాబెటిస్ కేర్ అనే అమెరికన్ జర్నల్ నిర్వహించిన అధ్యయనంలో అధిక మోతాదులో తెల్ల బియ్యం తినడం వల్ల దీర్ఘకాలిక మధుమేహ సమస్యలు వస్తున్నాయని వెళ్లడయ్యింది. ఒక రోజులో 450 గ్రాముల కన్నా ఎక్కువ మోతాదులో తెల్ల బియ్యం తో చేసిన పదార్థాలు తినటం వల్ల వయసు పెరిగే కొద్దీ డయాబెటిస్ సమస్య వస్తోందని తెలిపారు.

అన్నం త్వరగా జీర్ణమవుతుంది, దీనివల్ల వెంట వెంటనే తినాలి అని అనిపిస్తుంది. ఉడికించిన అన్నం లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, ఇవి శరీరంలోని చక్కెర స్థాయిని పెంచుతాయి. లంచ్ సమయంలో కడుపునిండా అన్నం తిన్న తర్వాత నిద్ర వచ్చినట్లు అనిపిస్తుంది, దీనికి కారణం శరీరంలోని చక్కెర స్థాయి పెరగటమే. రోజూ అన్నం తినడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. మధుమేహ సమస్య ఉన్నవారు అన్నం తినక పోవడం మంచిది.

పెద్దవారు పూర్వం జొన్న రొట్టె, సద్ద రొట్టె, రాగి ముద్ద లాంటివి ఎక్కువగా తినేవారు. ఇప్పుడు చాలామంది తిరిగి అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. వీటితో చేసిన ఆహారం తినటం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు రావు. జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలతో తయారయ్యే ఆహారం తినటం వల్ల మధుమేహ సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు అని నిపుణులు సలహా ఇస్తున్నారు. డయాబెటిక్ ఉన్న వారు వారంలో మూడు రోజులైనా పప్పు తినాలి. ఆహారంలో చిక్కుడు కాయలు, ఆకు కూరలు అధికంగా చేర్చుకోవడం వల్ల మధుమేహ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.