Coffee Side Effects: ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే చాలామందికి రోజు గడవదు .ఇప్పుడున్న టెన్షన్స్ ప్రపంచంలో ఒక కప్పు కాఫీ తాగితే ఒత్తిడి నుండి ప్రశాంతత కలుగుతుందని చాలామంది లో ఒక భావన ఉంటుంది. నలుగురు వ్యక్తులు ఒక చోట కలిసిన కూడా వెంటనే వారికి గుర్తొచ్చేది టీ లేదా కాఫీ. చాలామందిలో ఉదయం లేవగానే పరగడుపున కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అలాంటివారికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగకపోతే మైండ్ పని చేయదు. డాక్టర్ల సూచన ప్రకారం ఉదయం లేవగానే పరగడుపునే కాఫీ తాగే అలవాటు ఉన్నట్లయితే వెంటనే దాన్ని మానుకోవటం మంచిదని సలహా ఇస్తున్నారు.
కాఫీ తాగడం వల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరగడుపున కాఫీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుందని తెలిపారు. కాఫీ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కడుపునొప్పి, వాంతులు, గుండెపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, రక్తపోటు లతోపాటు అనేక ఇతర దుష్ప్రభావాలు శరీరం మీద పడతాయి అని హెచ్చరిస్తున్నారు. పరగడుపునే కాఫీ తాగడం వల్ల ప్రశాంతతకు భంగం కలిగి నిద్రలేమి సమస్యలు వస్తాయి. రోజుకు ఆరు కప్పులు పైబడి కాఫీ తాగే వారు మెదడుకు సంబంధించిన వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది అని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో కాఫీ తాగే వారిలో తలనొప్పి, మానసిక ఆందోళన, దడ పుట్టడం, క్రమంగా గుండెపోటుకు దారి తీస్తాయి.
• ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లడమే కాకుండా జీవక్రియ, శారీరక పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కెఫిన్ ఎక్కువగా ఉన్న కాఫీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.
• అధికంగా కెఫిన్ తీసుకోవడంతో శరీరంలో జరిగే రియాక్షన్ వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాఫీ నాడీ వ్యవస్థ మీద ప్రమాదం ప్రభావం చూపి రక్తపోటును పెంచుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. గుండె సంబంధిత వ్యాధులు, బీపీ ఉన్నవారు కాఫీలు ఎక్కువగా తాగకపోవడం మంచిది.
• ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపులో మంట, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.
మీకు కనుక పరగడుపునే కాఫీ తాగే అలవాటు ఉన్న, అధిక మొత్తంలో కాఫీ తాగే అలవాటు ఉన్నా కూడా వెంటనే అలవాట్లను మార్చుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.