రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన వర్ల రామయ్యకు 17 ఓట్లు పడిన సంగతి తెలిసిందే. అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవరించి ఓట్లు చెల్లకుండా చేసారు. అది ఊహించిన ఘటనే. అయితే పక్కా టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండి..పక్కాగా ఓటు వేయాల్సిన బాధ్యత ఉండి కూడా ఆదిరెడ్డి భవానీ ఓటు వేయడంలో విఫలమయ్యారు. రాజ్యసభలో ఓటు ఎలా? వేయాలో ముందు చెప్పినా ఆదిరెడ్డి భవాని తప్పుగా ఓటు వేయడంతో ఆమె ఓటు చెల్లకుండా పోయింది. తాను పోలింగ్ సమయంలో పొరబడ్డానని..ఈవిషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని వివరణ ఇచ్చారు.
ఒకటి అని వేయాల్సిన చోట టిక్ మార్క్ పెట్టానన్నారు. ఈ విషయంలో తనదే పొరపాటు అని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎప్పుడూ ఓటు వేయకపోవడం వల్ల జరిగిన తప్పదింగా చెప్పుకొచ్చారు. ఓటు వేసే ముందు అక్కడున్న సిబ్బందిని టిక్ పెట్టొచ్చా? అని ప్రశ్నించగా పెట్టొచ్చని తల ఊపితే తాను ఆలోచించకుండా వాళ్లు చెప్పిందే చేసానన్నారు. అది నాకు రాంగ్ గైడెన్స్ లా ఉందని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో వాళ్లు తెలియదు అని చెప్పినా సరిపోయేదన్నారు. అనవసరంగా ఓటు ఎటూ కాకుండా పోయిందని చింతించారు భవానీ. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదిరెడ్డి భవానీ తెలివిగానే ఆ పని చేసారంటూ కామెంట్లు పడుతున్నాయి.
చంద్రబాబు నాయుడు క్యాండెట్ కి ఓటు వేయడం ఇష్టం లేకనే భవానీ తప్పుగా ఓటు వేసారని ప్రచారం జరుగుతోంది. వర్ల రామయ్యకు భవానీ ఓటు వేసినా? వేయకపోయినా? ఎలాగూ ఓడిపోతారన్నది తెలిసిన విషయం. అలాంటప్పుడు వేసి ఉపయోగం ఉండకపోగా? ఓటు వేయకపోతే! భవిష్యత్ రాజకీయాలకు అదే ఉపయోగపడే అవకాశం ఉంటుంది! అన్న కారణం వినిపిస్తోంది. ఒకవేళ భవిష్యత్ లో వైకాపాలోకి జంప్ అవ్వాల్సి వస్తే ఈ సాకు చెప్పి ఈజీగా జంప్ అవ్వొచ్చు అన్న కారణం అయిండొచ్చని కొందరి వాదన. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఎలాగూ బాగోలేదు. భవిష్యత్ చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలలో ఏమైనా జరగొచ్చు కదా.