చిరు మరో భారీ సినిమా షూటింగ్ డేట్ కూడా వచ్చేసింది.!

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆల్రెడీ నటించేసిన భారీ బడ్జెట్ సినిమా “ఆచార్య” రిలీజ్ కి రెడీగా ఉండగా.. మరో భారీ సినిమాను దర్శకుడు మోహన్ రాజా కాంబోలో గాడ్ ఫాదర్ అనే రీమేక్ సినిమాని చిత్రీకరణలో ఉంచారు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఇంకో సాలిడ్ అప్డేట్ వచ్చింది.

తమిళ్ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ గా దర్శకుడు మెహర్ రమేష్ తో ప్లాన్ చేసిన సినిమానే “భోళా శంకర్”. ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. పైగా చిరు కొత్త లుక్ లో ఇందులో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి ముహూర్తం షూటింగ్ స్టార్టింగ్ డేట్స్ ను సినిమా యూనిట్ ఖరారు చేసేసారు.

వచ్చే నవంబర్ 11న సినిమా ముహూర్తం 15న సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు. సో మెగాస్టార్ ఒకేసారి రెండు సినిమాలు కంప్లీట్ చేస్తారని చెప్పాలి. ఇక ఈ సినిమాలో చిరు పాత్రకి చెల్లెలిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.