సీఎం జగన్ మరో చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోకుండా.. మూతపడి ఉన్న బాపు మ్యూజియాన్ని అక్టోబర్ 1 న పున:ప్రారంభం చేయనున్నారు.
విజయవాడ బందరు రోడ్డులో ఉన్న బాపు మ్యూజియం గత ప్రభుత్వ పాలనలో మూతపడిపోయింది. దాని అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోకపోయినా.. సీఎం జగన్.. దాన్ని మళ్లీ అభివృద్ధి చేయించారు. 8 కోట్ల రూపాయలతో ఆ మ్యూజియాన్ని ఆధునీకరించారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి మ్యూజియాన్ని అభివృద్ధి చేశారు.
ఈ మ్యూజియం ద్వారా అందరికీ ఎంతో ఙ్ఞానం లభిస్తుందని.. కొత్తగా ఆధునీకరించిన మ్యూజియంలో ఆదిమ యుగం నుంచి ఆధునిక యుగం వరకు వాడిన 1500 వస్తువులను ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తామని.. పురావస్తుశాఖ కమిషనర్ వాణిమోహన్ స్పష్టం చేశారు.
అయితే.. దేశంలోనే ఏ మ్యూజియంలో లేనటువంటి టెక్నాలజీని ఈ మ్యూజియంలో ఉపయోగించారు. స్మార్ట్ ఫోన్ లో ఓ యాప్ ఆధారంగా మ్యూజియంలో ప్రదర్శింపబడుతున్న వస్తువుల చరిత్రను తెలుసుకునేలా మ్యూజియం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇక.. ఈ మ్యూజియాన్ని సీఎం జగన్.. అక్టోబర్ 1న ప్రారంభించనున్నారు.