రాజధానిపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెతులెత్తేసినట్లేనా? ఇక చేయడానికి ఆయన చేతుల్లో ఏమీ లేనట్లనా? అందుకే భారమంతా మోదీపేనా వేసారా? అంటే అవుననే తెలుస్తోంది. రాజధాని తరలింపును ఎన్నిరకాలుగా అడ్డుకోవాలో? అన్ని రకాల ప్రయత్నాలు చేసారు చంద్రబాబు. అమరావతితో పాటు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్ని అభివృద్దిలోకి తీసుకురావాలని సీఎం జగన్ శ్రమిస్తుంటే..చంద్రబాబు తన సామాజిక వర్గాన్నే అభివృద్ది చూడాలని కాక్షించి తరలింపును అడ్డుకుంటున్నారు. పాలన వికేంద్రీకరణ బిల్లుకు ఇప్పటికే శాసనమండలిలో ఎలా అడ్డుతగులారో తెలిసిందే.
రెండుసార్లు మండలిలో ఇదే పరిస్థితి ఎదురైంది ప్రభుత్వానికి. అంతకుమందు స్థానిక ప్రజల్ని రెచ్చగొట్టి అడ్డుకునే ప్రయత్నం చేసారు. రాజధాని అభివృద్ది గ్రామాల ప్రజల్ని రొడ్డెక్కించి..అమాయకుల ప్రాణాల్ని పణంగా పెట్టారు. చంద్రబాబు చేసిన పనికి అమాయక రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇక చంద్రబాబు జోలు పట్టి బిక్షాటన చేసారు. లాక్ డౌన్ ముందు వరకూ రాజధాని విషయంపై చంద్రబాబు ఇలాగే ముందుకు సాగారు. అయితే లాక్ డౌన్ తర్వాత ఆ ఉద్యమం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ప్రాణభయంతో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చంద్రబాబు హైదరాబాద్ లో మూడు నెలలుగా ఇల్లు కూడా కదల్లేదు.
ఓవైపు రాజధానిలో చెదురు మొదురుగా ఉద్యమం ఊపు కనిపించినా చంద్రబాబు పట్టించుకోలేదు. మొన్న మహానాడు కార్యక్రమంలో, నిన్న ఉద్యమం 200 రోజులు పూర్తయిన సందర్భంగానే చంద్రబాబు నోట రాజధాని మాట వచ్చింది. ఇక నిన్నే రాజధాని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే..కాపాడాల్సింది మోదీని అని అనేసారు. ఇక తాను చేయాల్సింది ఏమీ లేదన్నట్లు…మీరు మాత్రం ఉద్యమం ఇలా కొనసాగించడని చెప్పకనే చెప్పి తప్పించుకున్నారు. పనిలో పనిగాఅగ్గి పిడుగు అల్లూరి సీతారామారాజు ను కూడా ఇందులోకి లాగారు. ఆ స్వాతంత్ర్య సమరయోధుడి జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లూరి స్ఫూర్తితో ఉద్యమం కొనసాగిద్దామని చెప్పి ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగలించి… భారమంతా మోదీపైనే వేసారు. ఏం చేసినా మోదీనే చేయాలనేసారు.
దీన్ని బట్టి రాజధాని విషయంలో చంద్రబాబు చేతులెత్తేసినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చకొస్తుంది. చంద్రబాబు చేయాల్సిందంతా ఇప్పటికే చేసేసారని..ఇక చేయాల్సింది కేంద్రం..తప్పితే సీఎం జగన్ మనసు మార్చుకుని రాజధాని తరలించకుండా చేయడం. ఈ రెండు కూడా జరిగేవి కాదు. జగన్ హోదా అడగరు కాబట్టి మోదీ మీ రాజధాని మీ ఇష్టం అంటారు తప్ప అడ్డు తగిలే సీన్ లేదు. లేకుంటే సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్లు ఇప్పటికే ఆ ప్రయత్నాలు చేసి ఉండేవారు. వీళ్లంతా మీడియాలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప తరలింపు లో సాధ్యాసాధ్యాలు ఏంటన్నది వాళ్లకి తెలియకుండా ఉండదు కదా అన్నది విశ్లేషకుల అభిప్రాయం. మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపినా జగన్ మళ్లీ అదే బిల్లును రెండవసారి అసెంబ్లీలో అమెదించి మళ్లీ మండలికి పంపించి..చివరిగా దాన్ని చట్ట రూపం దాల్చే ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.