సమంత విడాకుల పై బ్రహ్మాజీ కామెంట్స్

brahmaji

తెలుగు ఇండస్ట్రీ లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉండి తనకు వచ్చిన చిన్న పాత్రలైనా తనదైన శైలిలో నటించి, మెప్పించి అందరితో బాగా ఉండే బ్రహ్మాజీ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో సమంత, నాగ చైతన్య విడాకుల పైన స్పందించాడు.

సెలెబ్రిటీ స్టేటస్ ఉన్నప్పుడు అన్ని సార్లు కాకపోయినా కొన్ని సందర్భాల్లో అయినా తప్పకుండా స్పందించాలి అని బ్రహ్మాజీ అన్నారు. సెలెబ్రిటీలు చెబితే ఆ మాట ప్రజల్లోకి ఈజీగా వెళుతుంది అని అన్నారు. ఉదాహరణకి సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నాక, చాలా మంది సమంత మీద నెగటివ్ చేసారు. ఒక నెటిజన్ సమంతని ఉద్దేశించి.. నువ్వు నాగ చైతన్య నుంచి రూ 250 కోట్లు తీసుకున్నావు. బ్యాడ్ క్యారెక్టర్ అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు.

అయితే అతనికి సమంత గట్టిగా సమాధానం చెప్పింది. నేను కూడా ఆ నెటిజన్ కామెంట్స్ కి రియాక్ట్ అయ్యా. నీకు సిగ్గు శరం లేదు. అసలు సమంత వ్యక్తిగత జీవితంతో నీకు సంబంధం ఉందా అని తిట్టినట్లు బ్రహ్మాజీ చెప్పారు. ఒక సెలెబ్రిటీతో చాట్ చేసే అవకాశం ఉన్నప్పుడు పద్దతిగా వ్యవహరించాలి. సినిమాల గురించి మాట్లాడవచ్చు. ఆమె నటన నచ్చకపోతే విమర్శించవచ్చు. అసలు పర్సనల్ గా కామెంట్స్ చేసే హక్కు ఎక్కడ ఉంది. సమంత ఫ్రెండ్స్ కూడా రియాక్ట్ కాలేదు. కానీ నాకు బాధ అనిపించి స్పందించినట్లు బ్రహ్మాజీ అన్నారు. సమంత కష్టపడి వర్క్ చేసి ఒక పొజిషన్ కి వచ్చింది. నాగ చైతన్యని వివాహం చేసుకుంది. ఎందుకో వాళ్ళిద్దరికీ కుదర్లేదు.. విడిపోయారు. మధ్యలో ఇలాంటి వాళ్లంతా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడాలి అని బ్రహ్మాజీ అన్నారు.

కొన్ని సార్లు విమర్శలకు స్పందించకపోవడమే మంచిది కానీ అవి కొన్ని సార్లు హద్దులుదాటి మనసుకు బాధ కలిగించినప్పుడు మాత్రం రియాక్ట్ అవ్వాలి అని బ్రహ్మాజీ అన్నారు.