పాన్ ఇండియన్ సినిమాలను దాటి “భీమ్లా నాయక్” కి రెస్పాన్స్.!

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజ్ ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అన్నీ సెట్టయ్యి పవన్ కి కనుక ఒక హిట్ పడితే దానిని ఆపడం కొన్నాళ్ల వరకు ఎవరికీ సాధ్యం కాదు.. మరి అది ఇప్పుడు రాజమౌళి “RRR”, సుకుమార్ “పుష్ప” లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమాలనే దాటి కొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ మూడు బిగ్ ప్రాజెక్ట్ లు నుంచి కూడా ఇప్పటి వరకు ఫస్ట్ సాంగ్స్ వచ్చేసాయి.

అలాగే మూడు కూడా బాగున్నాయి. కానీ పవన్ “భీమ్లా నాయక్” ఫస్ట్ సింగిల్ కి అయితే యూట్యూబ్ లో ఆల్రెడీ ఆ పాన్ ఇండియన్ సినిమాలను మించి భారీ రెస్పాన్స్ రాగా ఇప్పుడు జియో సావన్ లో కూడా భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ భారీ రికార్డ్ ను సెట్ చేసింది.

ఇంతకు ముందు ఇందులో పుష్ప సాంగ్ కి 3.7 మిలియన్ ప్లే లు ఉండగా దానిని ఇప్పుడు భీమ్లా నాయక్ 3.8 మిలియన్ ప్లే లతో బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. అలాగే ఇందులో రాజమౌళి సినిమాకి మాత్రం 2.7 మిలియన్ మాత్రమే ఇప్పుడు వరకు దక్కాయి.. దీనిని బట్టి భీమ్లా సాంగ్ ఏ స్థాయిలో ప్రతి ఒక్కరికీ నచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా రేపు దీని నుంచి రెండో సాంగ్ ప్రోమో విడుదల కానుంది.