మరో ఆల్ టైం ఇండియన్ రికార్డ్ సెట్ చేసిన “భీమ్లా నాయక్”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. అయితే మొదట్లో ఓ రీమేక్ సినిమాగా పెద్దగా అంచనాలు లేవు కానీ పవన్ పై డిజైన్ చేసిన స్పెషల్ గ్లిమ్ప్స్ వీడియో ని రిలీజ్ చేసాక మాత్రం ఈ సినిమా పై అంచనాలు మరో స్థాయికి వెళ్లిపోయాయి.

ట్రెండ్ సెట్టింగ్ రెస్పాన్స్ అందుకున్న ఈ వీడియో ఇండియా లోనే ఫస్ట్ 1 మిలియన్ గ్లింప్స్ గా రికార్డ్ నెలకొల్పింది. అంతేకాకుండా ఇప్పుడు మరో ఇండియన్ రికార్డ్ నే సెట్ చేసింది. కాకపోతే ఈసారి వ్యూస్ లో బద్దలు కొట్టింది. దీనికి ముందు చిరు “సైరా” పేరిట ఉన్న వ్యూస్ రికార్డ్ ని భీమ్లా రీసెంట్ గా బద్దలుకొట్టి మరో ఆల్ టైం ఇండియన్ రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా కి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.