అక్కడ ‘RRR’ అయితే ఏంటి? ఇక్కడ పవన్.!

ఈ దసరా పండుగ నుంచే టాలీవుడ్ లో భారీ సినిమాలతో పండుగ రేస్ లు హీట్ ఎక్కడం స్టార్ట్ అయ్యాయి. అలా వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఎట్టి పరిస్థితుల్లో పలు భారీ చిత్రాలు రిలీజ్ చేసి తీరుతాం అని ఎవరికి వారు తమ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ వస్తున్నారు. అలా ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమా రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ ట్రిపుల్ ఆర్ (RRR) కూడా రేస్ లోకి వచ్చి షాకిచ్చింది.

దీనితో అప్పటికి ఉన్న మన స్టార్ హీరోల సినిమాలు వాయిదా కన్ఫర్మ్ అని సినీ వర్గాలు చెప్పాయి. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెనకడుగు వేసేది లేదు అన్నట్టు లేటెస్ట్ గా కన్ఫర్మ్ అయ్యింది. నిన్న భీమ్లా నాయక్ రెండో పాట అనౌన్స్మెంట్స్ పై చిత్ర యూనిట్ ఓ అందమైన పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇందులో గమనిస్తే భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ జనవరి 12నే అని ఫిక్స్ అయ్యి ఉంది. సో అక్కడ రాజమౌళి సినిమా అయినా పవన్ సినిమా రావడం గ్యారంటీ అని చెప్పొచ్చు.