ఓటీటీపై బాలయ్య సంచలనం.. ‘అఖండ’మే.!

సినిమా స్టార్లు బుల్లితెరపై ‘హోస్ట్స్’గా వ్యవహరించడం కొత్తేమీ కాదు. ఓటీటీ పుణ్యమా అని సినిమా స్టార్లు మరింతగా బుల్లితెరపై కనిపించడానికి మార్గం సుగమం అవుతోంది. తాజాగా ఈ లిస్టులోకి బాలయ్య వచ్చి చేరారు. ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్‌గా ఓ సూపర్బ్ ప్రోగ్రామ్ సిద్ధమవుతోంది.

ఈ విషయమై ఇప్పటికే కొన్ని గాసిప్స్ రాగా, అదిప్పుడు అధికారికం. బాలయ్య తొలిసారిగా హోస్ట్ చేస్తున్న కార్యక్రమం ఎలా వుంటుందన్న ఉత్కంఠ అతని అభిమానుల్లో కనిపిస్తోంది. ఓ పక్క అబ్బాయ్ యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అంటూ బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం విదితమే.

మొత్తమ్మీద, నందమూరి అభిమానులకి డబుల్ ధమాకా అన్నమాట. బాలయ్య హోస్ట్ చేయబోయే ఆ ప్రోగ్రామ్ వ్యూస్ పరంగా సంచలనాలనే సృష్టించబోతోందన్న చర్చ జరుగుతోంది. ఇక, నాగార్జున బిగ్ బాస్ రియాల్టీ షోతో సందడి చేస్తోన్న విషయం విదితమే.

ఇంతకీ బాలయ్య హోస్ట్ చేయబోయే ఆ ప్రోగ్రామ్ జోనర్ ఏంటి.? అందులో గెస్టులుగా ఎలాంటి స్టార్లు రాబోతున్నారు.? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అన్నట్టు, ‘అఖండ’మైన స్థాయిలో ఈ ప్రోగ్రాంని డిజైన్ చేశారట.