బాలయ్య ఆన్ డ్యూటీ: అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య

నటుడిగా వెండితెరపై మాస్ ఆడియన్స్ మనసు దోచుకున్న బాలయ్య త్వరలో ఓటీటీ తెరపై సందడి చేయబోతున్నారన్న వార్త గత కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తకు బలం చేకూరుస్తూ బాలయ్య ఓటీటీలో చేయబోయే ఆ షోకి సంబంధించి తాజాగా ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు ‘ఆహా’ నిర్వహకులు.

‘అన్‌స్టాపబుల్’.. మనిషిని మనిషిగా ఆవిష్కరించే షో.. త్వరలోనే మీ ఆహాలో కలుస్తాను అంటూ హోస్ట్‌గా బాలయ్య స్టైలిష్ లుక్స్‌ ఆకట్టుకుంటున్నాయి ఈ గ్లింప్స్‌లో. నవంబర్ నుంచి ఈ షో ప్రసారం కానుంది. అనుకోకుండా మాటల్లో బాలయ్యతో ఓ షో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదిలిన ప్రయత్నమే ఈ అన్‌స్టాపబుల్ షోకి ప్రేరణ ఇచ్చింది అని ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.

తెరపై నటుడిగా కనిపించే బాలయ్య నిజ జీవితంలో అస్సలు నటించరు. భావోద్వేగాల్ని అస్సలు ఆపుకోలేని స్వచ్చమైన మనిషి. అందుకే ఈ షోకి ఆయనే హోస్ట్‌గా మిస్టర్ పర్‌ఫెక్ట్ అని నిర్మాత అల్లు అరవింద్, బాలయ్యకు కితాబిచ్చారు.

అంటే పూర్తిగా బాలయ్యను దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ చేసిన ప్రోగ్రామే ఈ టాక్ షో అని అర్ధమవుతోంది. చూడాలి మరి, బాలయ్య ఈ షోను తనదైన స్టైల్లో ఎలా నడిపిస్తారో.