అతనితో స్నేహం చేస్తే అడుక్కోవాల్సిందే..ఆశు రెడ్డి షాకింగ్ కామెంట్స్?

సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని ఇండస్ట్రీలో సెలబ్రిటీలగా మారిన వారిలో అశు రెడ్డి ఒకరు. ఈమె టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇక కొంచెం సమంత పోలికలు ఉండడంతో జూనియర్ సమంత అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇక తనకు సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉండడంతో ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకుంది. అయితే రెండు సార్లు కూడా ఈమె మధ్యలోనే బయటకు రావడం గమనార్హం.

అషు రెడ్డి మాదిరిగానే బుల్లితెర సీరియల్స్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ సార్ధక్ కూడా రెండు సార్లు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి రెండు సార్లు రన్నరప్గా నిలిచారు. అయితే తనకు రన్నర్ గా నిలిచినందుకు బాధలేదని, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నానని సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా అషు రెడ్డి నిత్యం అఖిల్ తో గొడవ పడుతూ పెద్ద ఎత్తున రచ్చ చేసేది. ఇలా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.

అయితే బయటకు వచ్చినా కూడా వీరి మధ్య ఉన్న ఈ గొడవలు తగ్గిపోలేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అషు రెడ్డి తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు అఖిల్ గురించి అతనితో స్నేహం గురించి ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు అషు రెడ్డి సమాధానం చెబుతూ అతనితో స్నేహం చేస్తే అడుక్కోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు.ఈ విధంగా అఖిల్ గురించి ఆశు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యల పై అఖిల్ ఫాన్స్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.