టాక్..చిరు కోసం వెనక్కి తగ్గనున్న అల్లు అర్జున్.!

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం “పుష్ప”. పాన్ ఇండియన్ లెవెల్లో భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాది డిసెంబర్ 17 రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు. అయితే అధికారికంగా ఈ ప్రకటన ఇచ్చినా బన్నీ మనసులో వేరే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.

బన్నీ నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనికి కారణం మెగాస్టార్ అని తెలుస్తోంది. చిరు నటించిన “ఆచార్య” కానీ క్రిస్మస్ రేస్ లో నిలిస్తే బన్నీ వెనక్కి తగ్గనున్నాడట. అందుకే సినీ వర్గాల్లో పుష్ప రిలీజ్ డేట్ వచ్చినా బన్నీ మాత్రం తన సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా ఈ పోస్ట్ చెయ్యలేదు. సో మెగాస్టార్ కోసం బన్నీ ఆగుతున్నట్టే అనుకోవాలి.