ప్రభాస్ మంచి భోజన ప్రియుడు. గోదావరి జిల్లాల రుచులను వెతుక్కుని మరీ ఆస్వాదిస్తుంటాడు. తిండి విషయంలో ఎలాంటి రిస్టక్షన్స్ పెట్టుకోని స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ మాత్రమే. కావాల్సినంత తిని వర్కవుట్స్ ద్వారా ఫిజిక్ మెయింటైన్ చేస్తుంటాడు. ప్రభాస్ భోజనం చేస్తే అది విందు భోజనం లానే ఉంటుందని అంటుంటారు. ప్రభాస్ తాను తినడమే కాదు తన చుట్టూ ఉన్నవారికి కూడ ఇష్టంగా తినిపిస్తుంటాడు. ప్రభాస్ తో పరిచయం ఏర్పడితే ఆయన్నుండి అందే మొదటి అతిథి సత్కారం భోజనమే. ప్రభాస్ తో పనిచేసిన, పరిచయం ఉన్న ప్రతిఒక్కరూ ఆయన పెట్టే భోజనం గురించి ప్రత్యేకంగా చెబుతుంటారు.
తాజాగా కూడ ఒక నటి ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది. నటి భాగ్యశ్రీ ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రంలో ఒక కీ రోల్ చేస్తోంది. ఇటీవల షూటింగ్ రీస్టార్ట్ కావడంతో ఆమె కూడ షూటింగ్లో పాల్గొంటోంది. సీట్లో తనతో పాటు వర్క్ చేసిన ఆమెకు గోదావరి రుచుల టేస్ట్ ఏంటో చూపించాలనుకున్నాడు ప్రభాస్. అందుకే మోస్ట్ ఫేమస్ పూతరేకులు బాక్సుల కొద్ది ప్రత్యేకంగా తెప్పించి ఇచ్చారట. ఆ పూతరేకులు భాగ్యశ్రీకి తెగ నచ్చేశాయట. ఎంత కంట్రోల్ చేసుకున్నా తినకుండా ఉండలేకపోతోందట. అందుకే పూతరేకులు ఇచ్చినందుకు ప్రభాస్ కు థాంక్స్ చెబుతూనే నన్ను పూర్తిగా స్పాయిల్ చేశావ్ అంటోంది కూడ.