బీజేపీది పక్కా కక్ష సాధింపే… ఇవిగో ఆధారాలు!

దేశంలో బిజేపీయేతర పార్టీలలో ఉండే నాయకులు ఎవరైనా ఎంత అవినీతి చేసినా.. ఎన్ని అక్రమాలకు పాల్పడినా.. అనంతరం వారు కాషాయ కండువా కప్పేసుకుంటే చాలు.. వారి పాపాలు క్షమించబడతాయి.. వారు పవిత్రులు అయిపోతారు.. పునీతులై వెలుగుతారు. కేటీఆర్ లో చెప్పాలంటే.. వాషింగ్ పౌడర్ నిర్మా సిద్ధంతం అన్నమాట! ఇవన్నీ బీజేపీ పై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ విమర్శలు మాత్రమే అని ఎవరైనా అనుకుంటే అది కచ్చితంగా తప్పే అంటున్నాయి తాజా గణాంకాలు!

అవును నిజంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను.. తమ రాజకీయ కక్ష సాధింపులకు పావుగా బీజేపీ వాడుకుంటుందనే చెప్పాలి! ఎందుకంటే… 2014లో మోడీ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫైల్ చేసిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నాయకులు, వారి బంధువుల మీద నమోదయ్యాయి. మరో విచిత్రం ఏమిటంటే… ఇందులో 0.46% శాతం కేసులే రుజువయ్యాయి! ఈ ఒక్క లైన్ చాలు… మోడీ సర్కార్ ఏ స్థాయిలో ప్రతిపక్ష నాయకులపై మానసికంగా దాడులు చేస్తుందో చెప్పడానికి.

ఉదాహరణకు… కేజ్రీవాల్ సర్కార్ ను కూల్చేసి బీజేపీలో చేరి సీఎం కావాలని మనీష్ సిసోడియాకు బీజేపీ ఆఫర్ ఇచ్చింది. దాన్ని ఆయన తిరస్కరించి కేజ్రీవాల్ వెంట నడిచారు. ఆ తర్వాతనే లిక్కర్ స్కాం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆయన.. అరెస్టు కాబడిన సంగతి తెలిసిందే!

అస్సాం కాంగ్రెస్ ను లీడ్ చేసే హిమంత బిశ్వ శర్మ ఒకప్పుడు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. కానీ అతడి లూప్ హోల్స్ వెతికి అయనిపై సీబీఐ, ఈడీ కేసులు మోపారు. దాంతో ఆయన బీజేపీలో చేరారు. అంతే.. ఆయనపై నమోదైన కేసులు ఏవీ అతీగతీ లేకుండా పోయాయి. కనీసం దాని విషయంలో సీబీఐ, ఈడీలు స్పందించిన పాపాన పోలేదు!

ఇదే క్రమంలో నాడు టీడీపీ రాజ్యసభ ఎంపీల విషయంలోనూ ఇదే జరిగింది. వారు ఉన్నపలంగా బీజేపీలో చేరాక వారిపై కేసులు నిలిచిపోయాయి, దాడులు ఆగిపోయాయి.

ఇక లేటెస్ట్ గా కవిత విషయంలోనూ అదే జరిగిందట! కవితకు తండ్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. కేటీఆర్ ను సీఎం చేయాలని చూస్తున్నారని.. అందుకే బీజేపీలో చేరి లీడ్ చేయాలని బీజేపీ ఆఫర్ ఇచ్చిందట. దీనికి కవిత ససేమిరా అనడంతోనే ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరికించారని అంటున్నారు. అంటే.. ఇక్కడ కవిత తప్పు చేశారా చేయలేదా అన్న పాయింట్ కాసేపు పక్కనపెడితే… బీజేపీ ఆఫర్ ను తిరస్కరించడమే ప్రస్తుతం కవిత పరిష్తితికి ప్రధాన కారణం అంట!

సో… బీజేపీ హయాంలో ఈ దేశంలో రాజకీయ కక్షసాధింపులు గట్టిగా జరుగుతున్నాయని.. బీజేపీ వ్యతిరేకులపైనే దర్యాప్తు సంస్థలు అత్యంత కఠినగా ప్రవర్తిస్తాయని చెప్పడానికి.. మచ్చుకు పైన పేర్కొన్న ఉదాహరణలు సరిపోతాయేమో!!