Home Movie Reviews 'లా' మూవీ రివ్యూ - కోర్టు రూమ్ టార్చర్

‘లా’ మూవీ రివ్యూ – కోర్టు రూమ్ టార్చర్

తొలి కన్నడ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ‘లా’ ఈ రోజు అమెజాన్ లో విడుదలయ్యింది. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ బ్యానర్ రూపొందించడంతో దీనికి మంచి హైప్ వచ్చింది. దర్శకుడు రఘు సమర్థ్ కి రెండో సినిమా. హీరోయిన్ రాగిణీ ప్రజ్వల్ కి తొలి సినిమా. తొలి సినిమా రెగ్యులర్ ప్రేమ సినిమాగా వుండకూడదని టాలెంట్ ని పరీక్షించే ఈ పాత్ర  ఒప్పుకున్నట్టు చెప్పుకుంది. ఈ సినిమా రెగ్యులర్ లీగల్ డ్రామాగా తీయలేదని దర్శకుడు కూడా చెప్పుకున్నాడు. అయితే ఇటీవల తమిళంలో ఓటీటీలో విడుదలైన జ్యోతిక నటించిన ‘పొన్మంగళ్ వందాళ్’ కూడా ఇలాటి లీగల్  డ్రామానే. ఇలాటి హీరోయిన్ పాత్రే. రేప్ బాధితురాలు తన కేసుని తను వాదించుకునే లాయర్ పాత్ర. ఈ కన్నడ క్రియేటివిటీ ఫ్లాపయిన జ్యోతిక క్రియేటివికి ఎంత భిన్నంగా వుంది? ఇది క్రియేటివిటీయేనా, లేక క్రిమి కీటకమా ఓసారి చూద్దాం…

కథ

నందిని (రాగిణీ ప్రజ్వల్) లా గ్రాడ్యుయేట్. ఓ రాత్రి గ్యాంగ్ రేప్ కి గురవుతుంది. పోలీస్ స్టేషన్ కెళ్తే హేళన చేస్తారు. మూడు నెలలు గడిచిపోతాయి. ఆమె తనకి జరిగింది సోషల్ మీడియలో వైరల్ చేసేసరికి ఆందోళనలు చెలరేగుతాయి. దీంతో పోలీస్ కమీషనర్ కేసుని సీఐడీ ఇన్స్ పెక్టర్ పార్థ సారథి బ్రహ్మ (హేబ్బాలే కృష్ణ) కి అప్పగిస్తాడు. పార్థ సారథి బ్రహ్మ ఇన్వెస్టిగేట్ చేసి ముగ్గుర్ని (లిఖిత్ కుర్బా, ఇమ్రాన్ పాషా, మధు హెగ్డే) అరెస్ట్ చేసి కేసు పెడతాడు. నందిని ఈ కేసుని తను వాదిస్తానంటుంది. నిందితుల డిఫెన్స్ న్యాయవాదిగా శ్యాం ప్రసాద్ (రాజేష్ నటరంగ) వస్తాడు. న్యాయం కోసం అతడితో తలపడుతుంది నందిని. ఇందులో విజయం సాధించిందా? ఆమె విజయాన్ని ఇన్స్ పెక్టర్ బ్రహ్మ ఎందుకు అడ్డుకోబోయాడు? ఆమె దాచిన అసలు నిజం ఏమిటి? ఈ నిజం బయట పడితే ఏం చేసింది? ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

నటనలు-సాంకేతికాలు

కొత్త హీరోయిన్ రాగిణీ ప్రజ్వల్ తొలి సినిమాకి ఎంపిక చేసుకున్న పాత్ర మంచిదే. కానీ తనకి నటించడం రాక, దర్శకుడికి సినిమా తీయడం రాక చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రారంభం నుంచీ ఎక్కడా రేప్ బాధితురాలిగా కన్పించదు. పోగొట్టుకుంది పర్సు అయినట్టు, పోతే పోయిందన్నట్టు మేకప్ చెదరకుండా తిరుగుతూంటుంది. బీఆర్ చోప్రా తీసిన ‘ఇన్సాఫ్ కా తరాజూ’ (1980) లో జీనత్ అమన్ ని చూస్తే రేప్ బాధితురాలంటే ఏమిటో తెలిసేది రాగిణికి. ఇక లాయర్ గా కూడా నవ్వొచ్చే విధంగా వుంది. చివర్లో అసలు నిజంతో క్లయిమాక్స్ లో నటన జలపాతం దగ్గర అరణ్య రోదనగానే మిగిలింది. ఎంత అరిచి ఏడుద్దామన్నా ఎమోషనే రావడం లేదు. ఎందుకైనా మంచిదని దర్శకుడు లాంగ్ షాట్ వేశాడు. సంగీత దర్శకుడు పీలగా విన్పించిన సంగీతం నుంచి మాత్రం మనకి రక్షణ లేదు. హీరోయిన్ని ఆచి తూచి ఎంపిక చేసుకున్నానని దర్శకుడనడమంటే ఇదేనేమో. ఇందులో ఏం ఆచి వుందో, ఏం తూచి వుందో అర్ధంగాదు.

హీరోయిన్ తండ్రి పాత్రలో అవినాష్, ఇన్స్ పెక్టర్ పాత్రలో హేబ్బాలే కృష్ణ, డిఫెన్స్ లాయర్ పాత్రలో రాజేష్ నటరంగ సమర్ధులైన సీనియర్ నటులు. కానీ కథ, సన్నివేశాలు తోడ్పడలేదు. అవినాష్ పోలీస్ స్టేషన్ లో రేప్ బాధితురాలైన కూతురి దగ్గరి కొచ్చి, ‘చట్టం తో ఏమీ తేలదమ్మా, జరిగింది మర్చి పో’ అనేసి లైట్ తీసుకుని కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయే పాత్ర. ఎక్కడా అతను జరిగిందానికి ఏ మాత్రం ఫీలవడు ఎవర్ గ్రీన్ గ్లామర్ గర్ల్ కూతురిలాగే. వీళ్ళని చూస్తే రేప్ మీదే మనకి జాలి పుడుతుంది.

ఇక జడ్జి సిద్ధ లింగయ్య పాత్ర వున్నాడు ముఖ్యమంత్రి చంద్రు అనే నటుడు. ఇతను కామెడీ జడ్జి. దర్శకుడికి కథలో ఎంటర్ టైన్మెంట్ తగ్గిందన్న బాధతో సీరియస్ కేసు వాదనల్లో జడ్జి కామెడీలు చూపించాడు. జడ్జికి తోడు బంట్రోతు. మధ్యలో జడ్జి గయ్యాళి పెళ్ళాం నుంచి ఫోను రావడం. బెంబేలెత్తి పోయి జడ్జి హనుమాన్ చాలీసా వేసుకోవడం. ఏం సినిమా తీసి అమెజాన్ కిచ్చాడో దర్శకుడికే తెలియాలి.

‘పొన్మంగళ్ వందాళ్’ లో గోవింద్ వసంత అనే సంగీత దర్శకుడి లాగే ఇక్కడ కూడా వైభవ్ వాసుకి అనే సంగీత దర్శకుడు, పరికరాలే లేనట్టు వీలయినంత పేలవంగా సంగీత సృష్టి గావించాడు. కెమెరా మాన్ సుగ్నన అనే ఒకతను మాత్రమే అప్పగించిన బాధ్యతకి కాస్త న్యాయం చేసినట్టు కనబడతాడు. సినిమా నిడివి రెండు గంటలే అయినా రెండు యుగాల్లా వుంటుంది.

కథా కథనాలు

కథకి అయిడియా మంచిదే. ఆచరణలో చెదిరి పోయింది. ముగింపులో హీరోయిన్ మోటివేషన్ కి ఇచ్చిన కారణంతో దీన్నొక బలమైన ఎమోషనల్ లీగల్ యాక్షన్ డ్రామా చేయొచ్చు. తన అయిడియాలో వున్న బలం, లోతు పాతులు తనకే తెలియక పోతే ఎలా? ఈ అయిడియాలో హీరోయిన్ తన శీలంతో తనే ప్రయోగం చేయడమనే రాడికల్ తెగింపు వుంది. ఈ పాయింటుని  హైలైట్ చేసి మార్కెట్ యాస్పెక్ట్ ని పట్టుకోవాలను కోలేదు దర్శకుడు. మొద్దుబారిపోయిన వ్యవస్థని లేపడానికి శీలాలతో ఇలాటి ప్రయోగాలు  తప్పవా అన్న సామాజిక ప్రశ్న ఈ కథలో వుంటే, ఏవో కామెడీలు చేస్తూ వుండిపోయాడు దర్శకుడు. చట్టంతో మగాడు ఈజీగా ఆడుకోగలడు. ఆడది ఆడుకోవాలంటే ఇక శీలాల్ని పణంగా పెట్టాలేమో.

ఇలాటి కథలో కూడా దర్శకుడికి ఎంటర్ టైన్మెంట్ తగ్గుతోందన్న వర్రీ తీవ్రంగా వున్నట్టుంది. రేప్ బాధితురాలైన హీరోయిన్ కి కామెడీ ఫ్లాష్ బ్యాకులు. అల్లరి చేష్టలు. కథలో జరిగిన విషయానికీ ఈ ఫ్లాష్ బ్యాకులకీ సంబంధమేమిటో, వీటినెలా ఎంజాయ్ చేయాలో అర్ధంగాదు. ఫస్టాఫ్ లో నాల్గు సార్లు ఈ కామెడీ ఫ్లాష్ బ్యాకులేస్తాడు. ప్రతీ రాత్రీ తనకి జరిగిందే గుర్తుకొస్తూ నిద్రపట్టడం లేదని హీరోయిన్ డైలాగు. ఎప్పుడు గుర్తొచ్చింది, ఎప్పుడు నిద్ర పట్టలేదు సీన్లే చూపించలేదు. పోయింది పర్సే కదా అన్నట్టు జాలీగా తిరుగుతూంటే.

‘పొన్మంగళ్ వందాళ్’, ‘లా’ రెండూ దాదాపు కథ లొకటే. తీసి ఫ్లాప్ చేసుకున్న విధం ఒకటే. క్రియేటివిటీకి రెండు తరాలు వెనకున్నాయీ సినిమాలు. కథ పక్కనబెట్టి, కనీసం ఇప్పుడు సినిమా ఇలా తీయరన్న ఆలోచన కూడా లేకపోతే ఎలా?

రచన, దర్శకత్వం: రఘు సమర్థ్
తారాగణం: రాగిణీ ప్రజ్వల్, హేబ్బాలే కృష్ణ, రాజేష్ నటరంగ, అచ్యుత్ కుమార్, ముఖ్యమంత్రి చంద్రు, లిఖిత్ కుర్బా, ఇమ్రాన్ పాషా, మధు హెగ్డే తదితరులు
సంగీతం: వైభవ్ వాసుకి, ఛాయాగ్రహణం: సుగ్నన
నిర్మాతలు: అశ్వనీ పునీత్, రాజ్ కుమార్
విడుదల: అమెజాన్
1.5/5

సికిందర్

- Advertisement -

Related Posts

లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : ‘డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే’ రివ్యూ

లైంగిక స్వేచ్ఛ – ఆర్థిక స్వేచ్ఛ : 'డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే' రివ్యూ హీరో స్వామ్యపు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు షోకేసు బొమ్మలుగా మిగిలిపోతున్నప్పుడు, కనీసం దర్శకురాళ్ళయినా ఆ షోకేసు పంజరంలోంచి హీరోయిన్ పాత్రలకి...

శోభనం గది సంగతులు – ‘మనియారయిలే అశోకన్’ రివ్యూ

రచన - దర్శకత్వం : షంజు జేబా తారాగణం : జాకబ్ గ్రెగరీ, అనుపమా పరమేశ్వరన్, నజ్రియా నజీమ్, షైన్ టామ్ చాకో, కృష్ణ శంకర్ తదితరులు సంగీతం : శ్రీహరి నాయర్,...

నాని చేసిన పొరపాటు – ‘వి’ – రివ్యూ

రచన - దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ తారాగణం : నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ తదితరులు సంగీతం : తమన్, అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం...

Recent Posts

ప్రభుత్వ ఉద్యోగులకు పండగ లాంటి వార్త చెప్పిన సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాల మీద వరాలు ప్రకటిస్తున్నారు. అధికారంలోకి వస్తే వెంటనే సీపీఎస్ రద్దు చేస్తానంటూ సీఎం జగన్.. ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.....

అనుష్కకు కాబోయే వరుడు ఇతనే!?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనుష్క పెళ్లి వార్తలు ఇవ్వాళ కొత్తేమీ కాదు. అయితే మరోసారి ఈ అమ్మడు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది.  అది కూడా తమ దగ్గరి...

తెలంగాణ డిగ్రీ పట్టభద్రులారా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు కోసం ఇలా నమోదు చేసుకోండి

మీది తెలంగాణా? డిగ్రీ పూర్తయిందా? డిగ్రీ పూర్తి చేసి కనీసం మూడేళ్లయినా అయిందా? అయితే మీకు త్వరలో తెలంగాణలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే చాన్స్ ఉంది. దాని కోసం మీరు...

సంక్రాంతికి ఊరెళుతున్నారా? 4 నెలల ముందే రైళ్లన్నీ ఫుల్.. నో టికెట్స్

ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పండగ ఏది అంటే సంక్రాంతి అని చెప్పుకోవాలి. సంక్రాంతి కాకుండా దసరా, దీపావళి లాంటి పండుగలు ఉన్నా కూడా... ఎక్కడెక్కడో స్థిరపడిన ఏపీ వాసులు.. సంక్రాంతి...

సీఎంకు చల్లటి చపాతీలు వడ్డించి అధికారి సస్పెండ్.. ఆ తర్వాత?

ఇది నిజంగా ఓ విచిత్ర సంఘటన. ముఖ్యమంత్రికి చల్లగా ఉన్న చపాతీలు వడ్డించారని ఓ ఫుడ్ సేఫ్టీ అధికారినే సస్పెండ్ చేశారు. విడ్డూరంగా ఉంది కదా.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?...

Today Horoscope : సెప్టెంబర్ 27 th ఆదివారం మీ రాశి ఫ‌లాలు

సెప్టెంబర్-27- ఆదివారం.- అధిక ఆశ్వీయుజమాసం - పాడ్యమి. మీ రాశి ఫ‌లాలు ఈ విధంగా ఉన్నాయి మేష రాశి:ఈరోజు సురక్షితమైన చోట డబ్బు దాయండి ! మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక...

కాస్ట్లీ కార్లలో షికార్లు, పార్టీల్లో కలవాడాలు.. రకుల్ పెద్ద తప్పే చేసేసిందిగా ..?

ఎవరైనా సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేసినా, ఎవరితో తిరిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎలాంటి చీకటి వ్యవహారాలు నడిపినా ఎవడూ పట్టించుకునే వాళ్ళు, పబ్లిసిటీ చేసే వాళ్ళుండరు. అదే కాస్త...

వైయస్ కుటుంభం మత మార్పిళ్లు ప్రోత్సహిస్తుందా??

2019 ఎన్నికల్లో చాలా మంది విశ్లేషకులు, రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారం చేపడుతుందని భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్...

సమంత ని అలా చూపించాలంటే దమ్ముండాలి…?

మజిలీ.. ఓ బేబి.. అక్కినేని సమంత నటించిన బ్లాక్ బస్టర్స్ సినిమాలు. ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్న సమంత ని జాను బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మరోసారి నాగ చైతన్య...

తనపై దాడికి వైస్సార్సీపీ కుట్రలు చేస్తోందంటూ బాంబు పేల్చిన ఎంపీ రఘురామరాజు

నర్సాపురం ఎంపీ రఘురామరాజు కొద్ది రోజులుగా వైసీపీ సర్కార్, సీఎం జగన్ లపై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే పలు విమర్శలు గుప్పించిన రఘురామపై అనర్హత వేటు...

Entertainment

ఒక్క అబ్బాయితో ముగ్గురు అమ్మాయిలు.. అర్ధరాత్రి రష్మిక రచ్చ

ఛలో బ్యూటీ రష్మీక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, చేసే చేష్టలు, ఫోటో షూట్లు నవ్వు తెప్పించక మానవు. ఓ బుజ్జికుక్క పిల్ల...

అనుష్కకు కాబోయే వరుడు ఇతనే!?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనుష్క పెళ్లి వార్తలు ఇవ్వాళ కొత్తేమీ కాదు. అయితే మరోసారి ఈ అమ్మడు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది.  అది కూడా తమ దగ్గరి...

ఈఎంఐలు కట్టలేకనే ముక్కు అవినాష్ బిగ్ బాస్ కు వెళ్లాడు.. హైపర్...

హైపర్ ఆది.. ఆయనకు పేరు పెట్టినట్టుగానే ఆయన కొంచెం హైపరే. ఆయన వేసే పంచులకు నవ్వలేక జడ్జిలు, రివర్స్ పంచ్ వేయలేక మిగితా కంటెస్టెంట్లు జుట్టు పీక్కోవాల్సిందే. ఆయన టాకింగ్ పవర్ అటువంటిది....

కంటెస్టెంట్లందరికీ పంచ్ ఇచ్చాడు.. నాగార్జున నిర్ణయంతో వారంతా షాక్!!

బిగ్‌బాస్‌లో మూడో వీకెండ్ బాగానా జరిగింది. మూడో వారంలో జరిగిన అన్ని విషయాలను శనివారం నాడు టచ్ చేశాడు నాగార్జున. రోబోలు టాస్కును గెలవడం, మనుషుల టీం సభ్యులు ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం,...

లైంగికంగా కలవమని బలవంత పెట్టకండి.. రష్మీ ఆవేదన

జబర్దస్త్ వేదిక మీద మెరిసిన అందం రష్మీ గౌతమ్. అంతకు ముందు ఎప్పటి నుంచి వెండితెరపై చిన్నా చితకా సినిమాలను చేస్తూ వచ్చినా రష్మికి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఇక అనసూయ మధ్యలో...

ఛిద్రమైన నా జీవితంలో వెలుగు నింపారు – సింగర్ సునీత

అందరిలాగే గాయకురాలు సునీత కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తన విషాదాన్ని తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో తాను బాలు గారు కలిసివున్న ఒక ఫోటో పెట్టి, అందరి...

కాస్ట్లీ కార్లలో షికార్లు, పార్టీల్లో కలవాడాలు.. రకుల్ పెద్ద తప్పే చేసేసిందిగా...

ఎవరైనా సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం చేసినా, ఎవరితో తిరిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎలాంటి చీకటి వ్యవహారాలు నడిపినా ఎవడూ పట్టించుకునే వాళ్ళు, పబ్లిసిటీ చేసే వాళ్ళుండరు. అదే కాస్త...

సమంత ని అలా చూపించాలంటే దమ్ముండాలి…?

మజిలీ.. ఓ బేబి.. అక్కినేని సమంత నటించిన బ్లాక్ బస్టర్స్ సినిమాలు. ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్న సమంత ని జాను బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో మరోసారి నాగ చైతన్య...

అజయ్ భూపతి,శర్వా సినిమాలోనూ ఆమెనే హీరోయిన్!

తొలి చిత్రం 'గ్యాంగ్‌లీడర్‌'తో యువతరాన్ని ఆకట్టుకుంది మలయాళీ సోయగం ప్రియాంక అరుళ్‌మోహన్‌. చూడచక్కనైన రూపంతో పాటు చక్కటి అభినయం కలబోతగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ సుందరి శర్వానంద్‌ సరసన 'శ్రీకారం' అనే...

Rashmi Gautam Traditional Photos

Telugu Actress,Rashmi Gautam Traditional Photos Check out, Rashmi Gautam Traditional Photos ,Rashmi Gautam Traditional Photos shooting spot photos, Actress Tollywood Rashmi Gautam Traditional Photos...