ఇన్సైడ్ టాక్ : వెంకీ మామ సినిమాలో ఊహించని హీరోయిన్..!

టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఇప్పుడు అందరు కూడా మంచి హిట్స్ అందుకోగా మరిన్ని ఆసక్తికర సినిమాలు అయితే వారు చేస్తున్నారు. ఇక ఈ హీరోస్ లో అందరి ఫెవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ గత ఏడాది ఎఫ్ 3 తో భారీ హిట్ అందుకోగా నెక్స్ట్ రానా నాయుడు అనే సిరీస్ ని అయితే ఇంకా చేయాల్సి ఉన్నారు.

ఇక ఇది ఓటిటి లో రావడానికి సిద్ధంగా ఉండగా ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా గా యంగ్ దర్శకుడు శైలేష్ కొలను(హిట్ సినిమాల ఫేమ్) తో ఓ సినిమా చేయనున్నారు. మరి ఈ సినిమాపై ఇప్పుడు క్రేజీ గాసిప్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అయితే ఊహించని హీరోయిన్ కనిపించనుందట.

మరి ఆమె ఎవరో కూడా కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ హిట్ సినిమాలో నటించిన శ్రీనిధి శెట్టి అట. మరి ఈమె ఈ కాంబినేషన్ సినిమాలో కనిపించనుందట. ఇక ఈ కాంబినేషన్ ఆల్ మోస్ట్  కన్ఫర్మ్ అన్నట్టుగా తాజా సమాచారం. ఇక దీనితో పాటుగా ఈ చిత్రం హిట్ యూనివర్స్ లో భాగంగా ఓ సినిమా లా ఉంటుంది అనే రూమర్ కూడా ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి వెంకీ మామ పై సినిమా కోసం ఇంకా స్క్రిప్ట్ ని డెవలప్ చేస్తున్నట్టుగా భోగట్టా..