ప్చ్.. వెంకీమామ “సైంధవ్”.. 

ఈ ఏడాది టాలీవుడ్ సంక్రాంతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. ఒకో స్టార్ నుంచి ఒకో స్పెషల్ సినిమా వస్తుండడంతో మూవీ లవర్స్ మరింత ఎగ్జైట్ అయ్యారు. కాగా ఈ చిత్రాల్లో అయితే మన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రమే “సైంధవ్”.

కాగా ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా తెరకెక్కించగా మంచి అంచనాలు కూడా దీనిపై నెలకొన్నాయి. మరి ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ కూడా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

అయితే మంచి అంచనాలు చాలా కాలం తర్వాత వెంకటేష్ నుంచి మంచి అగ్రెషన్ సినిమా తన మార్క్ విక్రమ్ టైప్ సినిమా అంటూ బాగానే హైప్ అందుకుంది ఈ చిత్రం కానీ విడుదల అయ్యాక ప్రీమియర్స్ చూసినవారి నుంచి అంత సానుకూల రెస్పాన్స్ అయితే రాలేదు.

చూసిన వారు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలు ట్విట్టర్ లో చెప్తున్నారు. వీటితో ఈ సినిమాకి మాత్రం ఏమంత గొప్ప రెస్పాన్స్ వచ్చినట్టుగా అనిపించడం లేదు. సినిమా జస్ట్ యావరేజ్ నుంచి బిలో యావరేజ్ గా మాత్రమే ఉందని అంటున్నారు. మెయిన్ గా సినిమాలో కథనం చాలా డల్ గా ఉందని కొందరు అంటున్నారు.

ఇక షాకింగ్ గా సంతోష్ నారాయణన్ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగోలేవట. దీనితో మొత్తంగా “సైంధవ్” కి మాత్రం ఇలాంటి రెస్పాన్స్ మాత్రమే రావడం చిత్ర యూనిట్ కి కూడా ఒకింత షాకింగ్ కావచ్చు. కాగా అల్టిమేట్ గా సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.