టిల్లుగాని హై ఓల్టేజ్ రొమాంటిక్ వైబ్ ఆల్రెడీ ‘డీజే టిల్లు’లో చూసేశాం. ఈసారి అంతకు మించి.. అంటూ, ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో రాబోతున్నాడు.
సిద్దు జొన్నలగడ్డ సరసన ఈసారి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ‘డీజే టిల్లు’ ప్రమోషన్లలో నేహా శెట్టి పుట్టుమచ్చల వ్యవహారం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓ సినీ జర్నలిస్టు బదనాం అయిపోయాడు. అదంతా జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అంటారు కొందరు.
ఈసారి కూడా అలాంటి పబ్లిసిటీ స్టంట్ ఏమైనా, అనుపమ పరమేశ్వరన్ మీద ‘టిల్లు స్క్వేర్’ టీమ్ ప్లాన్ చేస్తోందా.? అంటే, ఔననే చర్చ జరుగుతోంది. నేహా శెట్టితో పోల్చితే, అనుపమ పరమేశ్వరన్ మహా మాటకారి.
చూపులే కాదు, మాటలు కూడా చురకత్తుల్లానే వుంటాయ్. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించనంత బోల్డ్‌గా అనుపమ ఈ ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతకంటే బోల్డ్‌గా ఈ సినిమా ప్రమోషన్లలోనూ తనదైన గ్లామర్ ముద్ర వేయబోతోందిట అనుపమ పరమేశ్వరన్.
తాజాగా చిత్ర యూనిట్ వదిలిన ప్రోమో, సినిమాలో అనుపమ – సిద్దూల మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో వర్కవుట్ అయ్యిందనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. ‘పెద్దలకు మాత్రమే’ అనదగ్గ స్థాయిలో రొమాంటిక్ ట్రాక్ ఇద్దరూ నడిపించేశారు.
ఇది జస్ట్ ట్రెయిలర్ మాత్రమే, సినిమాలో డబుల్ మసాలా.. అంతకు మించి వుండబోతోందిట.