టైటిల్ “వీరసింహా రెడ్డి” ఐతే ‘జై బాలయ్య’ సాంగ్ కి ఎలా లింక్ అంటే?

ఈరోజు నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వీరసింహా రెడ్డి” సినిమా నుంచి మొదటి సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగ్ “జై బాలయ్య” అంటూ రిలీజ్ చేశారు ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది.

అంతా బాగానే ఉంది కానీ అసలు సినిమా టైటిల్ వీరసింహా రెడ్డి అయితే బాలయ్య పేరు మీద టైటిల్ సాంగ్ ని ఇరికించడం ఏంటి అని చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. అయితే ఇది ఎంత హీరో మీద అభిమానం ఉన్నా సినిమాలో మరీ అంత లాజిక్ లేకుండా పెడితే దరిద్రంగా ఉంటుంది.

మరి ఇక్క లాజిక్ ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రంలో కూడా బాలయ్య డబుల్ రోల్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో వీర సింహా రెడ్డి పాత్ర ఒకటి కాగా మరొకటి “బాల నరసింహా రెడ్డి” పాత్ర అట సో ఇలా జై బాలయ్య అనే పాట రెండో రోల్ బాలకృష్ణపై వచ్చినట్టుగా ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

ఇదే వీర సింహా రెడ్డి కి బాలయ్య పాటకి ఉన్న అసలు లింక్. ఇక ఈ సినిమాకి అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని వర్క్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.