ట్విట్టర్ రివ్యూ : “భగవంత్ కేసరి” రిజల్ట్ ఎలా ఉంది?బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడా? 

ఈ దసరా కానుకగా టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన తాజా చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమాల్లో  ఒకటైన “భగవంత్ కేసరి” కూడా ఒకటి. మరి టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన గత రెండు సినిమాలు కూడా భారీ హిట్ అవ్వడంతో ఈ సినిమా బాలయ్యకి హ్యాట్రిక్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు.

మరి ఆ రేంజ్ నమ్మకంతోనే వచ్చిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎలా ఉందో ఇప్పుడు తేలిపోయింది. కాగా ఈ చిత్రం ప్రీమియర్స్ షోస్ ఆల్రెడీ యూఎస్ లో పడిపోగా సోషల్ మీడియా ట్విట్టర్ లో భగవంత్ కేసరి రివ్యూస్ కూడా పడ్డాయి. మరి వీటి ఆధారంగా చూస్తే భగవంత్ కేసరితో బాలయ్య హ్యాట్రిక్ కొట్టేసినట్టే వినిపిస్తుంది.

కాగా చాలా వరకు ఈ సినిమాకి యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి తప్ప నెగిటివ్ కనిపించడం లేదు. అలాగే ఈ చిత్రం ఒక పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చూసినవాళ్లు అంటున్నారు. అంతే కాకుండా మరికొందరు బ్లాక్ బస్టర్ అని కూడా అంటున్నారు.

దీనితో ఇలా మొత్తానికి భగవంత్ కేసరికి అయితే హిట్ టాక్ తోనే మొదలైంది. ఇక వసూళ్లు మాత్రం ఏ రేంజ్ లో నమోదు అవుతాయో చూడాల్సిందే. కాగా ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. అలాగే థమన్ సంగీతం సమకూర్చాడు. 
https://x.com/HelloGuruu/status/1714802409078481105?s=20a
https://x.com/adarshac15_c/status/1714805170821869916?s=20
https://x.com/Super__Subbu/status/1714805330956476715?s=20