నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది హాట్ బ్యూటీ హనీరోజ్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ గతంలో తెలుగులో సినిమాలు చేసింది.తన అంద చందాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు కానీ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా తాను లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ ఊహించని కామెంట్లు చేసింది.
దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.తనను ఓ వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగానే ఫాలో అవుతున్నాడని అనవసరమైన పదజాలం ఉపయోగించి తనను దూషిస్తున్నాడని తెలిపింది. అయితే తనను అవమానించినప్పుడు ఎందుకు స్పందించడం లేదని, అలాంటి స్టేట్‌మెంట్‌లను ఎంజాయ్ చేస్తున్నారా లేక చెప్పినదంతా అంగీకరిస్తారా అని ఫ్రెండ్స్ అడుగుతున్న విషయాన్ని షేర్ చేసుకుంది.
ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉపయోగించి కామెంట్స్ చేస్తుంటే..వాటిని లెక్క చేయకుండా తాను వెళ్తే వాటిని సమర్ధిస్తున్నట్లుగా అనుకుంటారని హనీ రోజ్ తెలిపింది. అందుకే తాను ఈ కార్యక్రమానికి వెళ్లడానికి నిరాకరించినందుకు ప్రతీకారంగా ఆ వ్యక్తి నన్ను ఫంక్షన్‌లకు ఆహ్వానించినప్పుడు ఉద్దేశపూర్వకంగా నేను వెళ్లే ఫంక్షన్‌లకు రావాలని ప్రయత్నించి, స్త్రీత్వాన్ని అవమానించే విధంగా మీడియాలో నా పేరు ప్రస్తావిస్తున్నాడని అంటోంది. డబ్బు అహంకారంతో ఒక వ్యక్తి ఏ స్త్రీనైనా అవమానించగలడా భారతీయ న్యాయ వ్యవస్థ దాని నుండి ఎటువంటి రక్షణను అందించలేదా అని ఆవేదన వ్యక్తం చేసింది.
మహిళలపై లైంగిక రంగుల వ్యాఖ్యలు చేయడం వాటిని అనుసరించడం వంటి నేరాలను ప్రాథమికంగా ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఇండియన్ పీనల్ కోడ్‌లో అతని చర్యలలో ఉద్దేశం ఉంది. ఇకపై ఇంటర్వ్యూలలో తన పేరు ప్రస్తావిస్తే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కూడా పేర్కొంది అయితే సదరు బిజినెస్మేన్ ఎవరనేది మాత్రం పేర్కొనలేదు ఈ నటి. ఆమె ఆవేదన వ్యక్తం చేసుకున్న ఆమె అభిమానులు ఆమెకి సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు.