గాసిప్స్ – బాలయ్య సినిమాలో ఈ యంగ్ హీరో కీలక పాత్ర?

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన లాస్ట్ మూడు చిత్రాలు కూడా ఓ రేంజ్ లో ఒకదాని తర్వాత ఒకొకటి మంచిహిట్స్ గా నిలవగా ఇక నెక్స్ట్ బాలయ్య మరో హ్యాట్రిక్ విజయాలకు శ్రీకారం చుట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అయితే ఇప్పుడు బాలయ్య మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ అయినటువంటి దర్శకుడు బాబీ కొల్లి తో తన కెరీర్ లో 109వ సినిమా స్టార్ట్ చేయగా రీసెంట్ గానే సినిమా షూటింగ్ కూడా మొదలైంది. కాగా ఈ సినిమాలో అయితే మలయాళ భాషకి చెందిన ఓ యంగ్ హీరో కీలక పాత్రలో కనిపిస్తాడు అని కొన్ని రూమర్స్ మొదలయ్యాయి.

మరి ఆ హీరో ఎవరో కూడా కాదు నటుడు దుల్కర్ సల్మాన్ అట. ఇపుడు దుల్కర్ సల్మాన్ ఒక్క మళయాళంలోనే కాకుండా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా నటిస్తున్నాడు. అలా ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ అతన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది.

అయితే తాను ఇంకా ఓకే చెప్పాడో లేదో తెలీలేదు కానీ ప్రస్తుతానికి ఈవార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. మరి నిజంగా ఈ యంగ్ హీరో ఉన్నాడో లేదో అనేది కొన్నాళ్ళు ఆగి చూడాలి. కాగా ఈ సినిమాని బాలయ్య కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామాగా మేకర్స్ ప్లాన్ చేస్తుండగా యంగ్ నిర్మాత నాగ వంశీ నిర్మాణం వహిస్తున్నాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది.