బాలయ్య సినిమాలో ఆమె సర్ప్రైజ్ చేస్తుందట..!

ఈ ఏడాది స్టార్టింగ్ లోనే సంక్రాంతికి మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ ఇద్దరు కూడా భారీ హిట్స్ అందుకోగా వారిలో టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం “వీరసింహా రెడ్డి” ఒకటి కాగా ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఈ ఏడాదిలో పెద్ద పండుగ అయినటువంటి దసరా కానుకగా బాలయ్య మరోసారి వస్తున్నా చిత్రమే “భగవంత్ కేసరి”.

దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొనగా ఇపుడు సమయం దగ్గరకి వస్తుంది. అయితే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ఆమెతో పాటుగా లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా నటించింది. అయితే ఈమె బాలయ్య కూతురుగా కనిపిస్తుంది.

మరి ఈ ఇద్దరి హీరోయిన్స్ లో ఓ హీరోయిన్ మాత్రం అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని దర్శకుడు అనీల్ రావిపూడి అంటున్నారు. ఆమె మరెవరో కూడా కాదు హీరోయిన్ శ్రీలీలనే అట. ఆమె ఈ సినిమా కోసం ఫిజికల్ గా చాలా కష్టపడినట్టుగా ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

ఇక దీనితో పాటుగా శ్రీలీల నటన పరంగా కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అని అనీల్ తెలిపాడు. మరి ఇంత రేంజ్ లో ఆమె యాక్ట్ చేసిందో లేదో తెలియాలి అంటే ఈ శుక్రవారం వరకు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.