Sukumar: రంగస్థలం సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందనుకున్నాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన సుకుమార్!

Sukumar: రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో గ్రాండ్ గా నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ ఈవెంట్ కి భారీగా అభిమానులు వచ్చారు. అమెరికాలోని అభిమానులతో పాటు తెలుగు ప్రజలు కూడా అక్కడికి భారీగా వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మూవీ మేకర్స్ తో పాటు ఈవెంట్ కి టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కూడా గెస్ట్ గా హాజరయ్యారు. ఈ మేరకు సుకుమార్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. నేను ప్రతి హీరోని సినిమా చేస్తున్నప్పుడు ప్రేమిస్తాను. ఆ హీరోతో ఒక రెండేళ్లు ట్రావెల్ చేస్తాను. సినిమా అయినంత సేపు ఆ హీరోతో కనెక్ట్ అవుతాను. సినిమా అయ్యాక నేనెవరితో కనెక్ట్ అయి ఉండను. కానీ రంగస్థలం అయిన తర్వాత కూడా ఆ అనుబంధం అలాగే కొనసాగిన ఒకే ఒక్క హీరో రామ్ చరణ్. నాకు చరణ్ అంటే చాలా ఇష్టం. నా బ్రదర్ లాంటి వాడు. మీకు ఒక రహస్యం చెప్తాను. చిరంజీవి సర్ తో కలిసి నేను ఈ సినిమా చూసాను. ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను మీకు. ఫస్ట్ హాఫ్ అద్భుతం. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్. శంకర్ గారి సినిమాలు జెంటిల్మెన్, భారతీయుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసానో ఈ సినిమా అప్పుడు అంత ఎంజాయ్ చేశాను.

 

రంగస్థలం సినిమాకు కంపల్సరీ నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాను చరణ్ కి. కానీ ఈ సినిమా క్లైమాక్స్ లో తన ఎమోషన్ చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఎంత బాగా చేసాడంటే దీనికి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అని తెలిపారు సుకుమార్. ఈ సందర్భంగా సుకుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ చేంజర్ సినిమాకు నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.