యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. మరి అనేక అంచనాలు అయితే ఉన్న ఈ సినిమా రిలీజ్ మరికొన్ని నెలల్లో అయితే సిద్ధంగా ఉంది.
కాగా రీసెంట్ గానే రామ నవమి కానుకగా సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ భారీ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కి అప్పట్లో బాగానే అంచనాలు నెలకొల్పుకుంది కానీ ఇప్పుడు అయితే ఆదిపురుష్ పై హైప్ తగ్గిపోయినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది.
ఇక దీనికి నిదర్శనంగా అయ్యితే ఈ సినిమాకి జరిగే బిజినెస్ కోసమే చెప్పాలి. కాగా ఆదిపురుష్ సినిమాని ఇప్పుడు ఓవర్సీస్ లో కొనేందుకు అయితే ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ముందుకు రావట్లేదట. దీనికి కారణం సినిమాకి ఉన్న అవుట్ పుట్ మెయిన్ కారణం అన్నట్టుగా తెలుస్తుంది.
అంతే కాకుండా దీనితో పాటుగా మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ జరిపినా కూడా వారికి ఆదిపురుష్ మీద నమ్మకం లేదట. అందుకే ఆదిపురుష్ ని కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదట. కాగా దీనితో స్వయంగా నిర్మాతలే ఓవర్సీస్ మార్కెట్ లో రిలీజ్ చేయడమో లేక మళ్ళీ కొత్త టీజర్ వచ్చాక విజువల్స్ ఏమన్నా ప్రామిసింగ్ గా ఉంటే అప్పుడు డిస్ట్రిబూస్టర్ లు ముందుకొస్తారేమో చూడాలి.
