ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి అంచనాలు పెట్టుకొని ఉన్న పలు చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మాసివ్ విజువల్ ట్రీట్ సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో అయితే రామాయణం ఆధారంగా తెరకెక్కించాడు.
మరి సినిమాని ఎంతో గోప్యం గా షాట్ చేసినప్పటికీ టీజర్ తో మాత్రం తీవ్రంగా డిజప్పాయింట్ చేశారు. దీనితో కొత్త వెర్షన్ లో అయినా కూడా ఏమన్నా గట్టి మార్పులు చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా నుంచి రీసెంట్ గానే రామనవమి కానుకగా ఓ పోస్టర్ బయటకి వచ్చింది.
కాగా ఇప్పుడు ఈ పోస్టర్ విషయంలో కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యింది. ఈ పోస్టర్ హిందూ మత ఆచారాలకు విరుద్ధంగా ఉందని ముంబై కి చెందిన ఓ సనాతన వక్తగా చెప్పుకునే సంజయ్ దినానత అనే వ్యక్తి ఈ పోస్టర్ పై కంప్లైట్ నమోదు చేసాడట. ఈ పోస్టర్ లో నటుల వేషధారణలు సరిగ్గా లేవని అలాంటి దుస్తులు రాముడు వేసుకున్నట్టుగా ఎక్కడ లేదని అతడి ఆరోపణ అట.
అంతే కాకుండా పాత్రలు జంజపు తాడు కూడా వేసుకున్నట్టుగా లేదు అని రామాయణాన్ని రాముని పాత్రలను చిత్ర టీం తప్పుగా చిత్రాకరించారు అంటూ అతను కంప్లైంట్ చేయగా దానిపై ఇపుడు ముంబై పోలీస్ ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారట.
మరి ఇది ఎక్కడ వరకు వెళ్తుందో ఏమో కానీ ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఆదిపురుష్ టీజర్ చూసి ఉంటే రాముని పాత్ర జంజపు తాడుని ధరించి ఉందో లేదో తెలిసి ఉండేది. దానిపై వస్త్రధారణ వేసి ఉండొచ్చు అనుకోవచ్చు కదా.
Mantron se badhke tera naam
Jai Shri Ramमंत्रों से बढ़के तेरा नाम
जय श्री रामమంత్రం కన్నా గొప్పది నీ నామం
జై శ్రీరామ్#JaiShriRam #RamNavmi#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 pic.twitter.com/4ppdOnfPLr— Adipurush Movie (@Offladipurush) March 30, 2023
