రామ్ చరణ్ తీసుకెళ్తే అక్కిడికి తప్పకుండా వస్తా – షారుఖ్ ఖాన్ !

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన షారుక్ ఖాన్ నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. షారుక్ ఖాన్ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. ఇలా దేశవ్యాప్తంగా హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇక షారుక్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు. షారుక్ ఖాన్ , దీపికా పదుకొనే జంటగా నటించిన ఈ సినిమా జనవరి 25న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు ప్రారంభించింది.

ఈ క్రమంలో ఇటీవల సినిమా ప్రమోషన్ పనులను కూడా ప్రారంభించింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షారుఖాన్ ఇటీవల సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో అభిమానులు అడిగే ప్రశ్నలకు షారుఖ్ ఖాన్ సమాధానాలు చెప్పాడు. కొంతమంది అభిమానులు అడిగిన ప్రశ్నలకు షారుక్ ఖాన్ ఎంతో సరదాగా సమాధానాలు ఇచ్చాడు. అయితే ఈ క్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు షారుక్ ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల సోషల్ మీడియా లో అభిమానులతో ముచ్చటించిన షారుక్ ఖాన్ ని ”హాయ్ సర్, మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో మూవీ థియేటర్స్‌కి వస్తారా?’అని ఒక అభిమాని ప్రశ్నించాడు.

అభిమాని అడిగిన ప్రశ్నక షారూఖ్ ఖాన్ సమాధానం చెబుతూ ” తప్పకుండా వస్తాను.. కాకపోతే నన్ను రామ్ చరణ్ తీసుకెళితేనే అక్కడికి వస్తాను’ అని. షారూఖ్ సమాధానం చెప్పాడు.. అయితే షారుక్ ఖాన్ రామ్ చరణ్ కి ఇలా కండిషన్ పెట్టడంతో ఇది వైరల్ గా మారింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ అభిమానులతో కలిసి థియేటర్లో సినిమా చూడాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అభిమాని అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ గురించి షారుఖ్ఖాన్ ప్రస్తావించటం ఇప్పుడు వైరల్ గా మారింది.