గాసిప్స్ : రాజమౌళి, మహేష్ సినిమాకి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్.?

గ్లోబల్ సెన్సేషనల్ హిట్ ట్రిపుల్ ఆర్(RRR) తో ఆ సినిమా దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ లెవెల్లో భారీ స్థాయిలో తన పేరు వినిపిస్తూ ఎంతో గర్వకారణంగా అయితే నిలిచింది. అయితే ఇక నెక్స్ట్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ గ్లొబ్ ట్రాటింగ్ సినిమాని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ఇంకా స్క్రిప్ట్ పక్కాగా కంప్లీట్ అవుతుండగా ఓ భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ లా అయితే ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాపై అంచనాలు కోసం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మధ్య నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకోనుండగా.. 

మరో సెన్సేషనల్ గాసిప్ అయితే ఈ చిత్రంపై ఇపుడు వినిపిస్తుంది. ఈ చిత్రం అయితే హాలీవుడ్ లెవెల్లో గ్రాండ్ రిలీజ్ ఉండనుంది అని లేటెస్ట్ గా బయటకొచ్చిన రూమర్స్ కాగా ఈ చిత్రం కోసం హాలీవుడ్ నుంచి కొన్ని భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు అయితే ఈ చిత్రం హాలీవుడ్ రిలీజ్ కి కూడా ముందుకొస్తునట్టు తెలుస్తుంది.

పైగా ఆల్రెడీ రాజమౌళితో అయితే ఆ హాలీవుడ్ సంస్థలు మంతనాలు కూడా జరుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఓ కొలిక్కి నిర్ణయం లేదా అనౌన్సమెంట్ రావడానికి సమయం పట్టనుంది అని అయితే తెలుస్తుంది.