Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇకపోతే విజయ్ దేవరకొండ చివరగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ఒకేసారి వరుసగా రిస్కులు తీసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇక మీదట విజయ్ రిస్క్ తీసుకోవడం లేదట. ఓన్లీ ఫోకస్ అంటున్నారు. సెట్స్‌పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారట. రౌడీ హీరో విజయ్ కెరీర్ కు ఎవరి దిష్టో బాగా బలంగా తగిలేసింది.
అప్పట్లో వరస విజయాలతో రయ్‌మంటూ దూసుకొచ్చిన రౌడీ బాయ్‌కు ఈ మధ్య కాలంలో అస్సలు కలిసి రావడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా బెడిసి కొడుతున్నాయి. ఖుషీ సినిమా కూడా ఓకే అనిపించింది అనుకుని ఆనందించేలోపే, ఫ్యామిలీ స్టార్ దెబ్బ పడిపోయింది. ఈ మధ్యే కల్కిలో అర్జునుడిగా మెరిసారు విజయ్. ఫ్యామిలీ స్టార్ ఫలితం చూసాక విజయ్ దేవరకొండలో మార్పులు భారీగానే కనిపిస్తున్నాయి. గతంలో లైగర్ చేస్తున్నపుడే ఖుషీకి అది సెట్స్ పై ఉన్నపుడే గౌతమ్ సినిమాకు అది పూర్తికాక ముందే ఫ్యామిలీ స్టార్ కి ఓకే చెప్పారు విజయ్. కానీ ఇక మీదట ఈ పని చేయకూడదనుకున్నారట విజయ్ దేవరకొండ.
ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అంటున్నారు రౌడీ బాయ్. 2 సినిమాలు ఫైనల్ అయినా నిదానమే ప్రధానం అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత మరో సినిమా గురించి ఆలోచిస్తాను అంటున్నారు విజయ్. ఇందులో పోలీస్ గా నటిస్తున్నారు విజయ్. ఈ సినిమా పూర్తయ్యాకే రవి కిరణ్ కోలా, రాహుల్ సంక్రీత్యన్ సినిమాలు సెట్స్ పైకి రానున్నాయి. వీటిలో రవి కిరణ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా, రాహుల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ టేకప్ చేస్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ విజయ్‌లో గట్టి మార్పునే తీసుకొచ్చింది.