Bheemla Nayak:భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ లో పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రానా..!

Bheemla Nayak: ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా భీమ్లా నాయక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఫిబ్రవరి 23న బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 21 న జరగాల్సిన ఈ ఫంక్షన్ ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో 23 కి వాయిదా పడటం జరిగింది. ఈ వేడుకకు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఒక ముఖ్య పాత్రలో రానా నటించిన సంగతి తెలిసిందే, ఈ వేడుకలో రానా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నటుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి 12 సంవత్సరాలు అయ్యింది. నా కెరీర్లో ఇంతవరకు చాలా తెలుగు హిందీ సినిమాలు చేశాను, కానీ తెలుగు సినిమా హీరో ఎలా ఉండాలి అన్న కాన్సెప్ట్ ఇంకా అర్థం కాలేదు. ఇటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న సమయంలో.. నా కళ్ళ ముందు అసలు సిసలైన హీరో కనిపించాడు అంటూ పవన్ కళ్యాణ్ నీ చూసి రానా పొగడ్తల వర్షం కురిపించారు.

ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు ఒక లాగా ఉంటే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ తో..ఇక నుండి మరోలా ఉంటాయని రానా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇండియాలో ఇంతవరకు చాలా పెద్ద సూపర్ స్టార్లను చూశాను వారితో పని చేశాను కానీ పవన్ కల్యాణ్ చాలా డిఫరెంట్ అని ఆయన తెలియజేశారు. ఈ సినిమా చేయడంతో చాలా మంది మేధావులను కలిశాను. పవన్ కళ్యాణ్ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను అని కృతజ్ఞతలు తెలిపారు.

ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి రానా మాట్లాడుతూ , త్రివిక్రమ్ చాలా డిఫరెంట్ మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ఆయన లేకపోతే సినిమా లేదని తెలియజేశారు. సినిమాలో తనతో పాటు నటించిన నటీనటులకు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కేటీఆర్ ని మిగతా నాయకులను ఉద్దేశించి కృతజ్ఞతలు తెలియజేస్తూ…. తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా భారతీయ చలన చిత్ర రంగానికి సినీ హబ్ గా హైదరాబాద్ మారుస్తారన్న నమ్మకం ఉందని.. రానా సంచలన వ్యాఖ్యలు చేశారు.